For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold: కొండలా పేరుకుపోతున్న బంగారం నిల్వలు.. భారత్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది..? తాజా వివరాలు ఇలా..

|

Gold Reserves: ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు ఏ దేశం దగ్గర ఉన్నాయి? ఎన్ని టన్నుల బంగారం ఉంటుంది? దాని విలువ ఎంత? భారత్ వంటి దేశాల్లో ఎంత గోల్డ్ ఉంది. ఇలాంటి ఆశ్చర్యకరమైన ప్రశ్నలు మీకెప్పుడైనా కలిగాయా? వాటికి సమధానం ఇప్పుడు తెలుసుకోండి. కొండల్లా పేరుకుపోతున్న బంగారం నిల్వలపై స్పెషల్ స్టోరీ.. మీకోసం..

పెట్టుబడిగా బంగారం..

పెట్టుబడిగా బంగారం..

బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంతో పాటు భారతీయలకు సంస్కృతిలో ఒక భాగం కూడా. ప్రపంచ వ్యాప్తంగా మనంత భారీగా ఉపయోగించనప్పటికే అనేక దేశాల వద్ద టన్నుల కొద్ది బంగారం ఉంది. ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో ఇది సరైన పెట్టుబడి ఎంపిక. ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటాయి. అందువల్ల పెట్టుబడుల విషయంలో బంగారానికీ తగిన చోటు తప్పక ఇవ్వాలి. గోల్డ్ హబ్ అందించిన డేటా ప్రకారం.. ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో 30 దేశాల్లో నిల్వలు ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అగ్రస్థానంలో అమెరికా..

అగ్రస్థానంలో అమెరికా..

అమెరికా ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం దానివద్ద బంగారు నిల్వలు కూడా భారీగానే ఉన్నాయి. అమెరికాలో దాదాపు 8133.47 టన్నుల బంగారం ఉంది. జర్మనీ, ఇటలీ, రష్యాతో సహా దేశాలు కలిగి ఉన్న మొత్తం బంగారాన్ని కలుపుకుని అమెరికా ఒక్కటే కలిగి ఉంది. ఇది అమెరికన్ డిపాజిటరీల్లో ఎక్కువగా ఉన్నట్లు చెబుతారు. దీని మొత్తం విలువ దాదాపు 712 బిలియన్ డాలర్లుగా ఉంది.

 రెండో స్థానంలో జర్మనీ..

రెండో స్థానంలో జర్మనీ..

బంగారం అత్యధికంగా ఉన్న రెండో దేశంగా జర్మనీ 3358.5 టన్నులతో నిలిచింది. ఇది 2021 చివరి నాటికి 3359.09 టన్నుల గోల్ట్ కలిగి ఉంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 4.2 ట్రిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందుతుందని అంచనా. ఇది కూడా వచ్చే ఏడాది 4680 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. దాని ఆర్థిక వ్యవస్థ మాదిరిగానే పసిడి నిల్వలు కూడా బలంగా ఉన్నాయి.

 ఇటలీలో ఇలా..

ఇటలీలో ఇలా..

మూడో స్థానంలో ఉన్న ఇటలీ వద్ద 2541.84 టన్నుల బంగారం ఉంది. ఇది ఫ్రాన్స్ కంటే కొంచెం ఎక్కువ. 2019లో ఇటలీ తన బడ్జెట్ సంక్షోభం మధ్య కూడా ఒక్క గ్రాము బంగారాన్ని కూడా అమ్మేది లేదని తెలిపింది. ప్రస్తుతం నిల్వలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

 4th ప్లేస్ లో ఫ్రాన్స్..

4th ప్లేస్ లో ఫ్రాన్స్..

4వ స్థానంలో ఉన్న ఫ్రాన్స్ 4367.47 టన్నుల బంగారంతో ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 0.3 టన్నులు పెరిగింది. ఇందులో కొంత భాగం పొరుగు దేశాలలో ఉందని చెప్పబడింది, అయితే ఎక్కువ భాగం బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్‌లో ఉంది. 2009 నుండి ఫ్రాన్స్ వద్ద ఉన్న బంగారం నిల్వలు పెద్దగా మారకుండా ఉన్నాయని డేటా చూపిస్తుంది.

యుద్ధ సమయంలోనూ రష్యా దగ్గర..

యుద్ధ సమయంలోనూ రష్యా దగ్గర..

2301.64 టన్నుల పసిడి నిల్వలతో రష్యా ఐదవ స్థానంలో ఉంది. గత ఐదేళ్ల కాలంలో బంగారం నిల్వలను పెంచుకునేందుకు ఈ దేశం ఏకంగా 40 బిలియన్ డాలర్లను వెచ్చించింది. అయినప్పటికీ.. రష్యా తగినంత నిల్వలను నిర్వహించలేకపోయింది. అయితే గతేడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే గోల్డ్ నిల్వలు 6.22% మేర పెరిగాయి.

 చైనా సంగతేంటి..

చైనా సంగతేంటి..

ప్రపంచంలో ప్రముఖ వినియోగదారుగా ఉన్నప్పటికీ.. చైనా వద్ద 1948.31 టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారు కూడా. రీసెర్చ్ ప్రకారం.. ప్రపంచంలోని బంగారు మైనింగ్ ఉత్పత్తిలో చైనాకు 12% వాటా ఉంది.

 స్విట్జర్లాండ్..

స్విట్జర్లాండ్..

బంగారం ర్యాంకింగ్ లో 7వ స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌ దగ్గర 1040 టన్నుల బంగారం ఉంది. ఇందులో ఎక్కువ భాగం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిపాజిట్ చేయబడి ఉంది. 2014లో స్విస్ బ్యాంక్ బంగారం నిల్వలను పెంచుతుందా అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడం గమనార్హం.

జపాన్ దగ్గర..

జపాన్ దగ్గర..

చిన్న దేశమైన జపాన్‌లో 845.97 టన్నుల బంగారం ఉంది. డిసెంబర్ 2020 కరోనా కాలంలో ఆర్థిక సహాయాన్నిఅందించేందుకు గాను నాణేలను ముద్రించడానికి 80 టన్నుల బంగారాన్ని జపాన్ విక్రయించింది. జపాన్ లో బంగారం తక్కువ మొత్తంలో ఉండడంతో గోల్డ్ మైనింగ్ చేసేందుకు జపాన్ ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి.

భారత్ వద్ద నిల్వలు ఇలా..

భారత్ వద్ద నిల్వలు ఇలా..

టాప్- 10 జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ వద్ద 760.4 టన్నుల బంగారం ఉంది. గత కొన్నేళ్లుగా భారత్‌లో బంగారం నిల్వలు 150 టన్నులు పెరిగాయి. దేశంలో ముఖ్యంగా బంగారు ఆభరణాల రూపంలో భారీగా నిల్వలు ఉన్నాయి. కరోనా సమయంలో చాలా దేశాలు బంగారాన్ని అమ్మేసినప్పటికీ భారత్ మాత్రం తన నిల్వలను పెంచుకుంటూ పోయింది. ఇక పదవ స్థానంలో నిలిచిన నెదర్లాండ్స్ 612.45 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది.

 500 టన్నుల బంగారం ఉన్న దేశాలు..

500 టన్నుల బంగారం ఉన్న దేశాలు..

ప్రపంచంలో ఇతర దేశాలను గమనించినట్లయితే.. టర్కీ - 431.1 టన్నులు, తైవాన్ - 423.63 టన్నులు, పోర్చుగల్ - 382.57 టన్నులు, కజికిస్థాన్ - 368.12 టన్నులు, ఉజ్బెకిస్తాన్ - 337.47 టన్నులు, సౌదీ అరేబియా - 323.07 టన్నులు, ఇంగ్లాండ్ - 310.29 టన్నులు, లెబనాన్ - 286.83 టన్నులు, స్పెయిన్ - 281.58 టన్నులు, ఆస్ట్రియా - 279.99 టన్నులు, థాయిలాండ్ - 244.16 టన్నులు, పోలాండ్ - 228.66 టన్నులు, బెల్జియం - 227.4 టన్నులు, అల్జీరియా - 173.56 టన్నులు, వెనెజువలా - 161.22 టన్నులు, ఫిలిప్పీన్స్ - 156.29 టన్నులు, సింగపూర్ - 153.74 టన్నులు, బ్రెజిల్ - 129.56 టన్నులు, స్వీడన్ - 125.72 టన్నులు, దక్షిణాఫ్రికా - 125.35 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నాయి.

English summary

Gold: కొండలా పేరుకుపోతున్న బంగారం నిల్వలు.. భారత్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది..? తాజా వివరాలు ఇలా.. | know about latest gold reserves data of top 10 countries released by gold hub where india ranks

know about gold reserves of top 10 countries in the world
Story first published: Tuesday, August 9, 2022, 16:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X