For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold News: అరకిలో బంగారం రేటు రూ.5,000.. ఎక్కడ..? ఎప్పుడంటే..?

|

Gold News: భారతీయులందరూ బంగారం ప్రియులు. అయితే ఇప్పుడు బంగారం కొనలేని రేట్లకు చేరుకుని ఆకాశాన్ని తాకింది. కనీసం దానిని కొనాలనే ఆలోచనవస్తేనే భయమేస్తోంది సామాన్యులకు. దాచుకున్న డబ్బుతో కాసు బంగారం కొనుక్కోలేని స్థితి ఏర్పడింది. అయితే ఈ సమయంలో గోల్డ్ కు సంబంధించిన ఒక వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

బంగారం ధర..

బంగారం ధర..

మన తాతల కాలంలో బంగారం ఇప్పటికంటే చాలా చౌక అనే మాటలు మనందరం వినే ఉంటాం. దీనిని రుజువు చేసే 60 ఏళ్ల నాటి ఒక బిల్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ధర పెరిగినా దాని మీద మక్కువ తగ్గకపోవటంతో తక్కువ పరిమాణంలోనైనా భారత ప్రజలు ఈ లోహాన్ని కొంటూనే ఉన్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

చారిత్రక గరిష్ఠాలు..

చారిత్రక గరిష్ఠాలు..

ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైమ్ హై రూ.56,341 వద్ద ఉన్నప్పటికీ.. కొద్దికాలంగా బంగారం ధర ఆశ్చర్యకరంగా పెరిగింది. దీనికి అనేక అంతర్జాతీయ పరిణామాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ఒక గ్రాము బంగారం ధర ఒక చాక్లెట్ ధరకు అందుబాటులో ఉండేది. దీనికి రుజువుగా ఆరోజుల్లో బంగారం ఎంత చౌకగా ఉందో నిర్ధారించే 60 ఏళ్ల నాటి బిల్లు ఆన్‌లైన్‌లోకి వచ్చింది.

మహారాష్ట్ర..

మహారాష్ట్ర..

మహారాష్ట్రకు చెందిన 1959 నాటి బంగారు ఆభరణాల కొనుగోలుకు సంబంధించి హిందీలో రాసిఉన్న బిల్లు ఇప్పుడు ప్రత్యక్షమైంది. బిల్లు ప్రకారం దాదాపుగా 12 గ్రాముల బంగారం రూ.113గా ఉన్నట్లు అందులో చూపటం జరిగింది. అంటే ఒక్కో గ్రాము ధర దాదాపుగా రూ.10. ద్రవ్యోల్బణాన్ని, రూపాయి విలువను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ రోజుల్లో రూ.10 ప్రస్తుతం రూ.3-4 వేలకు సమానం అని తెలుస్తోంది.

 అరకిలో బంగారం..

అరకిలో బంగారం..

ప్రస్తుతం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,172గా ఉంది. ఇదే డబ్బుతో ఆకాలంలో దాదాపుగా 533 గ్రాముల కంటే ఎక్కువ బంగారం కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ గా మారిన బిల్ మహారాష్ట్రంలోని వామన్ నింబాజీ అష్టేకర్ అనే దుకాణదారుడికి చెందినది. గతకాలానికి చెందిన బిల్లులో శివలింగ్ ఆత్మారామ్ అనే వినియోగదారుడు బంగారం రూ.621, వెండి రూ.252 మొత్తం రూ.909తో కొనుగోలు చేసినట్లు బిల్లు చెబుతోంది.

Read more about: gold silver viral trending
English summary

Gold News: అరకిలో బంగారం రేటు రూ.5,000.. ఎక్కడ..? ఎప్పుడంటే..? | know about bill that going viral in internet 500 gms gold at 5000 rupees

know about bill that going viral in internet 500 gms gold at 5000 rupees
Story first published: Sunday, January 15, 2023, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X