For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం-బిట్ కాయిన్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? రూ.1000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుందంటే

|

మన దేశంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అనాధిగా దీనిని ఆభరణంగా ధరించడం తెలిసిందే. ఆభరణంగా ధరించడంతో పాటు పసిడిపై పెట్టుబడి మన దేశంలో క్రమంగా పెరుగుతోంది. గత కొద్ది కాలంగా బంగారానికి ప్రత్యామ్నాయంగా క్రిప్టో కరెన్సీ దూసుకు వచ్చింది. కరోనా పరిస్థితుల్లో ఓ వైపు స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంటే, మరోవైపు బంగారం, ఇంకోవైపు క్రిప్టో ధరలు భారీగా పెరిగాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు చేరుకుంది. క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ కూడా 65,000 డాలర్లను తాకింది. అయితే ఇటీవలే ఈ రికార్డును కూడా బద్దలు కొట్టింది.

బిట్ కాయిన్ వంటి క్రిప్టోను బంగారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలా, క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. అయితే క్రిప్టోను పలు దేశాలు ఇప్పటికీ అంగీకరించడం లేదు. అది మినహాయించి ఇది తక్కువ కాలంలోనే అద్భుతంగా రాణించింది.

బంగారం ఆకర్షణీయం.. బిట్ కాయిన్ గోల్డ్ 2.0

బంగారం ఆకర్షణీయం.. బిట్ కాయిన్ గోల్డ్ 2.0

బంగారం భారతీయులకు ఆకర్షణీయ పెట్టుబడి సాధనం. ద్రవ్యోల్భణం హెడ్జ్(పెట్టుబడి), స్వల్పకాలిక నగదు రుణాలకు, ద్రవ్యత కోసం ఉపయోగపడతాయి. మరో విషయం ఏమంటే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎలాంటి బ్యాంకులు అవసరం లేదు.

ఇక క్రిప్టో కరెన్సీ పూర్తి డిజిటల్ అసెట్. ఇటీవలి కాలంలో ఇది ఆకర్షణీయ పెట్టుబడి సాధనంగా కనిపిస్తోంది. క్రిప్టోలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బిట్ కాయిన్ అతిపెద్దది. దీనిని గోల్డ్ 2.0 అని చెబుతారు. ఇది 2021 ప్రారంభం నుండి పరుగులు పెడుతోంది. ఇదే పరుగు 2022లోను కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణుల మాట. గత కొంతకాలంలో దీని మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. భారతదేశంలో ప్రస్తుతం పది మిలియన్లకు పైగా కస్టమర్లు పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి చట్టబద్ధతకు సంబంధించి ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇటీవల బంగారంతో పాటు క్రిప్టో కూడా ఎగిసిపడుతున్నందున ఈ రెండింటిని పోల్చడం సాధారణంగా మారింది. పెట్టుబడిదారుడు దేనిని ఎంచుకోవాలనే అంశం కీలకంగా మారింది.

ఎందులో ఇన్వెస్ట్ చేయాలి?

ఎందులో ఇన్వెస్ట్ చేయాలి?

పెట్టుబడిదారుడు తమ పెట్టుబడిని డైవర్సిఫైడ్ చేయడం తప్పనిసరి. తాను పెట్టుబడి పెట్టాలనుకున్న మొత్తాన్ని ఆయా రంగాల్లో, ఆయా స్టాక్స్‌లో, ఆయా పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. తమ ఆదాయంలో పెట్టుబడికి పది శాతం నుండి పదిహేను శాతం కేటాయిస్తే, అందులో ఒక్కో పెట్టుబడి సాధనానికి కొంత కేటాయించాలి. బంగారం కోసం కొంత మొత్తం, క్రిప్టోకు ఇంకొంత మొత్తం కేటాయించాలి. అయితే కొంతమంది ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇటీవలి కాలంలో బంగారం, క్రిప్టో దిగ్గజాల ధరలు ఎలా మారాయో చూద్దాం.

ఈ సంవత్సరం ప్రారంభంలో బిట్ కాయిన్ రికార్డ్ గరిష్టం 65,000 డాలర్లను తాకింది. అయితే చైనా మైనింగ్ అణిచివేత కారణంగా మే నెలలో బిట్ కాయిన్ 30,000 డాలర్లను తాకింది. బిట్ కాయిన్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే ఉన్నందున ఇటీవల 67,000 స్థాయికి చేరుకుంది. క్రిప్టో పైన ఆందోళనలు, అనుమానాలు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతున్నారు.

బిట్ కాయిన్ ప్రస్తుతం 44,14,581 డాలర్ల వద్ద ఉంది. ఏడాది క్రితం రూ.10 లక్షల వద్ద ఉంది. అయిదేళ్ల క్రితం రూ.50,000 డాలర్ల దిగువన ఉంది. అంటే అయిదేళ్ల క్రితం రూ.47వేల వద్ద ఉన్న బిట్ కాయిన్, ఇప్పుడు రూ.45 లక్షలకు చేరుకుంది.

ఇక బంగారం ఏడాది క్రితం రూ.52వేల పైన ఉంది. ఇప్పుడు రూ.48,000కు చేరువలో ఉంది. అయిదేళ్ల క్రితం రూ.27వేల వద్ద ఉంది.

మీరు రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే..

మీరు రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే..

- బిట్ కాయిన్‌లో మీరు ఏడాది క్రితం రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది రూ.4,159 రిటర్న్స్ ఇస్తుంది. మూడేళ్ల క్రితం అంతేమొత్తం (రూ.1000) పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.6640, అయిదేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేస్తే రూ.83,549 వస్తుంది.

- ఎథేరియంలో మీరు ఏడాది క్రితం రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది రూ.8,094 రిటర్న్స్ ఇస్తుంది. మూడేళ్ల క్రితం అంతేమొత్తం (రూ.1000) పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.12,441, అయిదేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేస్తే రూ.30,270 వస్తుంది.

- బంగారంలో మీరు ఏడాది క్రితం రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది రూ.920 అవుతుంది. అంటే మీ పెట్టుబడి కంటే తగ్గుతుంది. ఎందుకంటే పసిడి గత ఏడాది ఇదే సమయంలో ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉంది. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. కానీ మూడేళ్ల క్రితం అంతేమొత్తం (రూ.1000) పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.1520, అయిదేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేస్తే రూ.1382 వస్తుంది.

- వెండిలో మీరు ఏడాది క్రితం రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది రూ.849 అవుతుంది. అంటే మీ పెట్టుబడి కంటే తగ్గుతుంది. ఎందుకంటే వెండి గత ఏడాది ఇదే సమయంలో ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉంది. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. కానీ మూడేళ్ల క్రితం అంతేమొత్తం (రూ.1000) పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.1699, అయిదేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేస్తే రూ.1267 వస్తుంది.

కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. బంగారం చాలా కాలంగా మంచి రిటర్న్స్ అందిస్తోంది. కానీ గత కొంతకాలంగా బంగారాగానికి ప్రత్యామ్నాయంగా క్రిప్టో వచ్చింది. దీంతో తక్కువ కాలంలో భారీగా లాభపడింది. మున్ముందు ఇదే దూకుడు ఉంటుందా లేదా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

English summary

బంగారం-బిట్ కాయిన్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? రూ.1000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుందంటే | Is Investing in Cryptocurrency better than investing in Gold?

Gold, traditionally, has been a safe haven for Indian households. India, along with China, leads Gold (jewelry) consumption year on year.
Story first published: Wednesday, October 27, 2021, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X