For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Inspiring Story: చిన్న కిరాణా దుకాణం సంపాదనతో 11 దేశాలు చుట్టేసిన మహిళ.. అద్బుతమైన స్టోరీ..

|

World Travel: మనసులో కోరిక ఉంటే దానిని ఎలాగైనా నెరవేర్చుకోవచ్చు. అది ఎంత పెద్ద కల అయినా తప్పక నెరవేరుతుందనటానికి ఈ మహిళ జీవితం మంచి ఉదాహరణ. ఇందుకోసం మనకు కావలసింది కేవలం మనసులో కోరిక, పట్టుదల మాత్రమే. మనస్పూర్తిగా ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని కేరళ మహిళల నిరూపించింది. ఆమె కుటుంబ అవసరాలను తీర్చుకోవటంతో పాటు తన కల కోసం పొదుపు చేసింది. అలా 10 సంవత్సరాల్లో.. 11 దేశాలను చుట్టేసింది ఈ మహిళ. ప్రపంచ యాత్రలు చేసి తన కలలను నెరవేర్చుకుంటోంది.

విదేశాలకు ప్రయాణం..

విదేశాలకు ప్రయాణం..

మోలీ జాయ్ విదేశాలకు వెళ్లడానికి డబ్బును కేటాయించుకునేది. దీని కోసం.. ఆమె వారంలోని చివరి రోజుల్లో, సెలవు దినాల్లో కూడా దుకాణాన్ని తెరుస్తుంది. డబ్బు తక్కువగా ఉన్నప్పుడు ఆమె తన బంగారాన్ని తాకట్టు పెట్టేది. తర్వాత ఆమె తన దుకాణం సంపాదన నుంచి వాటికి చెల్లింపులు చేసి బంగారాన్ని విడిపించుకునేది. ఇలా డబ్బు అవసరాలను బ్యాలెన్స్ చేసుకునేది.

10 సంవత్సరాల్లో.. 11 దేశాలకు ప్రయాణం..

10 సంవత్సరాల్లో.. 11 దేశాలకు ప్రయాణం..

కేరళలోని ఇరుంపనం నివాసి అయిన మోలీ జాయ్ చిత్రపూజలో సాధారణ కిరాణా దుకాణం నడుపుతోంది. ఆమె వయస్సు ప్రస్తుతం 61 సంవత్సరాలు. ఇప్పటి వరకు విదేశాల్లో పర్యటించేందుకు ఆమె దాదాపు రూ. 10 లక్షలు ఖర్చు చేసింది. ఇందులో చాలా డబ్బు దుకాణం ద్వారా సంపాదించిందే. ఆమె దుకాణాన్ని ఆ ప్రాంతంలో లులు మాల్ అని పిలుస్తారు. ఈ దుకాణాన్ని ఆమె భర్త 26 ఏళ్ల క్రితం ప్రారంభించాడు.

2012లో మెుదటి సారిగా అంతర్జాతీయ విమానం ఎక్కి..

2012లో మెుదటి సారిగా అంతర్జాతీయ విమానం ఎక్కి..

మోలీ జాయ్ భర్త 18 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె దుకాణం నడుపుతోంది. మోలీ మనసులో మొదటిసారిగా.. తన పొరుగువారు కేరళ నుంచి బయటికి వెళుతున్నప్పుడు ప్రయాణం చేయాలనే భావన కలిగింది. మోలీ జాయ్ కూడా పళని, ఊటీ, మైసూర్ తదితర ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లింది. ప్రయాణాలతో ఆనందాన్ని పొందిన ఆమె.. మరింత ముందుకు వెళ్లాలనుకుంది. ఆమె పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసి 2012లో తన మొదటి అంతర్జాతీయ విమానాన్ని ఎక్కింది. ఈ ప్రయాణం కోసం 1.5 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఆ తర్వాత 2017లో మలేషియా, సింగపూర్‌లను చుట్టేసింది.

Read more about: inspirational story
English summary

Inspiring Story: చిన్న కిరాణా దుకాణం సంపాదనతో 11 దేశాలు చుట్టేసిన మహిళ.. అద్బుతమైన స్టోరీ.. | inspirational story of kerala women molly joy who travelled 11 countries with income from small grocery store

inspirational story of kerala women molly joy who travelled 11 countries
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X