For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ అప్, ఐటీ డౌన్: 52వారాల గరిష్టానికి అదానీ గ్రీన్ ఎనర్జీ

|

ముంబై:స్టాక్ మార్కెట్లు బుధవారం(సెప్టెంబర్ 16) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 60.88 పాయింట్లు లేదా 0.16 లాభంతో 39,105.23 వద్ద, నిఫ్టీ 18.10 పాయింట్లు లేదా 0.16 శాతం లాభపడి 11,539.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.11.11 సమయానికి సెన్సెక్స్ 124 పాయింట్ల లాభాల్లోకి వచ్చింది. అయితే ఆ తర్వాత కాసేపటికే 65 పాయింట్ల లాభాల్లోకి క్షీణించింది. ఆటో, ఫార్మా రంగాలు భారీ లాభాల్లో ఉన్నాయి.

ఈ రెండు రంగాలు దాదాపు అర శాతం మేర ఎగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. భారతీ ఎయిర్‌టెల్, స్టెరిలైట్ టెక్నాలజీస్ షేర్లు 4 శాతం మేర లాభపడ్డాయి. 10 టెలికం సర్కిళ్లలో మోడర్న్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్‌ను నిర్మించే ఒప్పందాన్ని భారతీ ఎయిర్‌టెల్ స్టెరిలైట్ టెక్నాలజీస్‌కు ఇచ్చింది. దీంతో ఈ షేర్లు భారీగా పెరిగాయి.

మార్కెట్‌లో రిలయన్స్ వెయిటేజీ 17%, మరి అమెరికా స్టాక్స్ మాటేమిటి?మార్కెట్‌లో రిలయన్స్ వెయిటేజీ 17%, మరి అమెరికా స్టాక్స్ మాటేమిటి?

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ జాబితాలో రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉండగా, టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హిండాల్కో, రిలయన్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, యూపీఎల్, సిప్లా, జీ ఎంటర్టైన్మెంట్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి.

రిలయన్స్ లాభాల్లో.. ఐటీ స్టాక్స్ నష్టాల్లో..

రిలయన్స్ లాభాల్లో.. ఐటీ స్టాక్స్ నష్టాల్లో..

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ రోజు 1.5 శాతానికి పైగా ఎగిసి రూ.2,356 వద్ద ట్రేడ్ అయింది. నిన్న రిలయన్స్ జియో, నేడు రిలయన్స్ రిటైల్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో ఈ షేర్ ధర అంతకంతకూ పెరుగుతోంది. ఐటీ స్టాక్స్ ఈ రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. టెక్ మహీంద్రా 0.3 శాతం, విప్రో 0.04 శాతం, టీసీఎస్ 0.28 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 0.30 శాతం మేర నష్టపోయాయి. ఇన్ఫోసిస్ ఒక్కటి మాత్రం లాభాల్లో ఉంది.

52 వారాల గరిష్టానికి..

52 వారాల గరిష్టానికి..

బుధవారం ఉదయం ట్రేడింగ్ సమయంలో 52 స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ, ఆషాపుర మినెకెమ్, అతుల్, బాఫ్నా ఫార్మాస్యూటికల్స్, బాలాక్సి వెంచర్స్, బయోకాన్, ఎస్టర్ ఇండస్ట్రీస్, హెగ్జావేర్ టెక్నాలజీస్, గ్లోబుస్ స్పిరిట్స్, గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్, ఇన్ఫీబీమ్ అవెన్యూస్, కెల్టాన్ టెక్ సొల్యూషన్స్, మైండ్ ట్రీ, క్విక్ హీల్ టెక్నాలజీస్, రాంకో సిస్టమ్స్ ఉన్నాయి. ఉదయం సమయానికి నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 28 షేర్లు లాభాల్లో, 22 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, హిండాల్కో ఇండస్ట్రీస్ ఉన్నాయి.

English summary

రిలయన్స్ అప్, ఐటీ డౌన్: 52వారాల గరిష్టానికి అదానీ గ్రీన్ ఎనర్జీ | Indices trade higher ahead of Fed meet, Sensex rises 125 points

The Indian markets inched higher in Wednesday's morning deals after a flat opening, lifted mainly by auto stocks.
Story first published: Wednesday, September 16, 2020, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X