For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: ఐటీ స్టాక్స్ నిన్న అలా.. నేడు ఇలా

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 374.75 పాయింట్లు(0.96%) లాభపడి 39,348.45 వద్ద, నిఫ్టీ 101.40 పాయింట్లు(0.88%) ఎగబాకి 11,604.80 వద్ద ప్రారంభమైంది. 744 షేర్లు లాభాల్లో, 181 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 37 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. నిన్న భారీ లాభాల్లో ముగిసిన ఐటీ, మెటల్ స్టాక్స్ మాత్రమే స్వల్ప నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.11.00 సమయానికి సెన్సెక్స్ 350 పాయింట్లు ఎగిసి 39,323 వద్ద ట్రేడ్ అయింది.

కొత్త రికార్డ్, TCS రూ.10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్: ఇన్వెస్టర్ల సంపద రూ.69వేల కోట్లు జూమ్కొత్త రికార్డ్, TCS రూ.10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్: ఇన్వెస్టర్ల సంపద రూ.69వేల కోట్లు జూమ్

ఐటీ స్టాక్స్ నిన్న అలా.. నేడు ఇలా..

ఐటీ స్టాక్స్ నిన్న అలా.. నేడు ఇలా..

- ఉదయం టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి.

- టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, టీసీఎస్, హిండాల్కో, ఇన్ఫోసిస్, గ్రాసీమ్ ఉన్నాయి.

- నిన్న టాప్ గెయినర్స్ జాబితాలో మూడు ఐటీ స్టాక్స్ ఉండగా, ఈ రోజు ప్రారంభంలో టాప్ లూజర్స్ జాబితాలో మూడు ఐటీ స్టాక్స్ ఉన్నాయి.

- హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, టీసీఎస్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి.

- టీసీఎస్ షేర్ ధర 1.58 శాతం, ఇన్ఫోసిస్ షేర్ ధర 0.83 శాతం, టెక్ మహీంద్ర షేర్ ధర 0.95 శాతం, విప్రో షేర్ ధర ఏకంగా 2 శాతం, కోఫోర్జ్ షేర్ ధర 0.76 శాతం క్షీణించింది. ఐటీ స్టాక్స్‌లో కేవలం హెచ్‌టీఎల్ టెక్ షేర్ ధర మాత్రమే 0.70 శాతం మేర పెరిగింది.

పుంజుకున్న రూపాయి

పుంజుకున్న రూపాయి

- మంగళవారం డాలర్ మారకంటో రూపాయి 13 పైసలు బలపడి 73.16 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్‌లో 73.29 వద్ద ముగిసింది. అక్టోబర్ 5వ తేదీన రూపాయి 15 పైసలు క్షీణించి 73.29 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో (గత గురువారం) 73.14 వద్ద క్లోజ్ అయింది.

- సెప్టెంబర్ నెలలో ఆటో సేల్స్ ఆశాజనకంగా ఉండటంతో ఆటో స్టాక్స్ లాభాల్లో ప్రారంభమయ్యాయి. టాటా మోటార్స్ 6 శాతానికి పైగా లాభపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా 2 శాతానికి పైగా ఎగిసింది. మారుతీ, అశోక్ లేలాండ్, బాష్, టీవీఎస్ మోటార్స్, ఐచర్ మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్‌తో పాటు టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ స్టాక్స్ 0.48 శాతం నుండి 1.84 శాతం మేర లాభపడ్డాయి. ఉదయం గం.10.30 సమయానికి నిఫ్టీ ఆటో 1.46 శాతం లాభపడింది.

మార్కెట్ లాభాలకు కారణాలు

మార్కెట్ లాభాలకు కారణాలు

- ఆసియా మార్కెట్లు రెండు వారాల గరిష్టాన్ని తాకాయి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా ఆసుపత్రి నుండి వచ్చారు. దీంతో అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై పడింది.

- ఆటో, ఫైనాన్సియల్ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ 6 శాతం, ఐసీఐసీఐ 1.05 శాతం, కొటక్ మహీంద్ర బ్యాంకు షేర్ ధర 0.042 శాతం లాభపడింది.

- నిఫ్టీ ఆటో 1.46 శాతం, నిఫ్టీ ఫార్మా 0.27 శాతం, నిఫ్టీ బ్యాంకు 1 శాతం లాభపడ్డాయి.

English summary

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: ఐటీ స్టాక్స్ నిన్న అలా.. నేడు ఇలా | Indices off day's high with Nifty below 11,600: auto stocks gain

The Sensex was up 374.75 points or 0.96% at 39,348.45, and the Nifty was up 101.40 points or 0.88% at 11,604.80. About 744 shares have advanced, 181 shares declined, and 37 shares are unchanged.
Story first published: Tuesday, October 6, 2020, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X