For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా 3వ రోజు సరికొత్త రికార్డులు, రిలయన్స్ భారీ పతనం!

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ వారంలో వరుసగా మూడు సెషన్లు మంచి లాభాలు నమోదు చేశాయి. గత రెండు సెషన్‌లలో సెన్సెక్స్ ఒక్కో సెషన్‌లో 700 పాయింట్ల చొప్పున మొత్తం 1400 పాయింట్ల వరకు లాభపడింది. నేడు సెన్సెక్స్ 316.02 పాయింట్లు(0.73%) లాభపడి 43,593.67 వద్ద, నిఫ్టీ 118.10 పాయింట్లు(0.93%) ఎగిసి 12,749.20 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1326 షేర్లు లాభాల్లో, 1196 షేర్లు నష్టాల్లో ముగియగా, 168 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి.

రిలయన్స్ మరోసారి భారీ పతనం

రిలయన్స్ మరోసారి భారీ పతనం

స్పుత్నిక్-వీ వ్యాక్సీన్ ఫలితాలు 92% కనిపిస్తున్నాయని రష్యా ప్రకటించింది. మొన్న ఫైజర్, నేడు రష్యా ప్రకటనతో మార్కెట్లు మరింత పుంజుకున్నాయి. మార్కెట్‌లో భారీ మార్కెట్ వ్యాల్యూ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మరోసారి కుప్పకూలింది. ఈ రోజు ఏకంగా 4 శాతం నష్టపోయి, మరోసారి రూ.2000 దిగువకు వచ్చింది. 4.07 శాతం (రూ.84.75 నష్టపోయిన స్టాక్ రూ.1,999.80 వద్ద క్లోజ్ అయింది. గత సెషన్‌లో రూ.2,084 వద్ద ముగిసిన స్టాక్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.2,092 చేరుకొని కాస్త ఆశలు నింపింది. ఆ తర్వాత పడిపోయింది. ఏ దశలోను కోలుకున్న సంకేతాలు కనిపించలేదు. అంతకంతకు పడిపోయి 2వేల లోపుకు చేరుకుంది.

నిఫ్టీ మెటల్, ఫార్మా అదుర్స్

నిఫ్టీ మెటల్, ఫార్మా అదుర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 7.25 శాతం, హిండాల్కో 6.08 శాతం, యాక్సిస్ బ్యాంకు 4.29 శాతం, ఐచర్ మోటార్స్ 4.11 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.92 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 5.66 శాతం, రిలయన్స్ 4.19 శాతం, టైటాన్ కంపెనీ 2.35 శాతం, ఏషియన్ పేయింట్స్ 0.82 శాతం, బ్రిటానియా 0.44 శాతం నష్టపోయాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.57 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.84 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.39 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.40 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.15 శాతం, నిఫ్టీ ఐటీ 4.68 శాతం, నిఫ్టీ మెటల్ 3.46 శాతం, నిఫ్టీ ఫార్మా 3.59 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.77 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.45 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ మీడియా 0.27 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.47 శాతం నష్టపోయాయి.

3 రోజులు వరుసగా రికార్డ్ స్థాయిలో క్లోజ్

3 రోజులు వరుసగా రికార్డ్ స్థాయిలో క్లోజ్

మార్కెట్లు వరసగా ఎనిమిది రోజులు లాభాల్లో ముగియగా, వరుసగా 3 రోజులు రికార్డుస్థాయిలో ముగిశాయి. మొన్న జీవనకాల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్, నిఫ్టీ, నిన్న ముందుకు కదలగా, నేడు మరింతగా ముందుకు సాగాయి.

మిడ్ క్యాప్ సూచీల 0.4 శాతం లాభపడ్డాయి.

43 నిఫ్టీ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.

టాటా స్టీల్ 8 శాతం లాభపడింది. యూరోపియన్ బిజినెస్ సేల్‌ను ఫైనలైజే చేసిన నేపథ్యంలో ఈ స్టాక్స్ దుమ్మురేపాయి.

ఐటీ స్టాక్స్ భారీగా జంప్ చేశాయి.

English summary

వరుసగా 3వ రోజు సరికొత్త రికార్డులు, రిలయన్స్ భారీ పతనం! | Indices gain for 8th day, Sensex ends 316 points higher

Indian markets staged a smart recovery after slipping into the red in the middle of the session on Wednesday. Gains in pharma and auto stocks lifted Sensex by 316 points higher to 43,593.67, while Nifty 50 ended at 12,749.15, up 118 points.
Story first published: Wednesday, November 11, 2020, 18:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X