For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 51,000కు దగ్గరగా: మెటల్, బ్యాంకింగ్ అదుర్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (బుధవారం, మార్చి 3) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న 447 పాయింట్లు లాభపడి 50,296.89 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు కూడా అదే దూకుడు కొనసాగించింది. అగ్ర రాజ్యం అమెరికా ఆర్థిక ప్యాకేజీ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై కనిపించి భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత మార్కెట్లపై ఈ ప్రభావం కూడా పడింది. బాండ్స్ మార్కెట్ వల్ల తలెత్తిన ప్రతికూలత నుండి సోమవారం అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్కడ లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఇప్పుడు సానుకూలంగా కదిలే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, స్పెక్ట్రం వేలం ముగియడంతో టెలికం షేర్ల కొనుగోళ్లు పెరగనున్నాయి.

Sovereign Gold Bond Scheme: నేటి నుండే.. ధర ఎంతంటే? అలా రూ.50 తక్కువSovereign Gold Bond Scheme: నేటి నుండే.. ధర ఎంతంటే? అలా రూ.50 తక్కువ

సెన్సెక్స్ భారీగా జంప్

సెన్సెక్స్ భారీగా జంప్

నిన్న 50,296 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, నేడు దాదాపు 450 పాయింట్లు లాభపడి 50,738.21 వద్ద ప్రారంభించింది. 50,870.63 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,512.84 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 600 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ 15,064.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,090.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,995.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 500 పాయింట్లు లాభపడి 50,796 వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు ఎగిసి 15,080 పాయింట్ల వద్ద కదలాడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 5.81 శాతం, JSW స్టీల్ 4.61 శాతం, అదానీ పోర్ట్స్ 3.79 శాతం, గ్రాసీమ్ 3.12 శాతం, హిండాల్కో 3.00 శాతం ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్ 1.56 శాతం, బజాజ్ ఆటో 1.32 శాతం, మారుతీ సుజుకీ 1.24 శాతం, ఐచర్ మోటార్స్ 0.70 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.62 శాతం నష్టపోయాయి.

రిలయన్స్ స్టాక్ 0.48 శాతం ఎగిసి రూ.2115 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 సూచీ 1.05 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.08 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 1.54 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.45 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.56 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.55 శాతం, నిఫ్టీ ఐటీ 1.05 శాతం, నిఫ్టీ మీడియా 1.06 శాతం, నిఫ్టీ మెటల్ 3.42 శాతం, నిఫ్టీ ఫార్మా 0.36 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.06 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.54 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.43 శాతం లాభపడ్డాయి. కేవలం నిఫ్టీ ఆటో 0.47 శాతం నష్టపోయింది.

English summary

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 51,000కు దగ్గరగా: మెటల్, బ్యాంకింగ్ అదుర్స్ | Indices at day's high with Nifty above 15,000 led by metal and financials

Among sectors, metal index rose 3 percent, while realty, power and oil & gas sectors rose 1 percent each.
Story first published: Wednesday, March 3, 2021, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X