గత కొన్నాళ్లుగా బుల్ జోరును కొనసాగిస్తున్న భారత స్టాక్ మార్కెట్లు నేడు డీలా పడ్డాయి. ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
Stock Market: గత కొన్నాళ్లుగా బుల్ జోరును కొనసాగిస్తున్న భారత స్టాక్ మార్కెట్లు నేడు డీలా పడ్డాయి. ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.

మార్కెట్ సూచీలు..
ఈ రోజు మార్కెట్లు నష్టాలతో ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్కె సూచీ సెన్సెక్స్ ఉదయం 9.48 గంటల సమయంలో 298 పాయింట్లు, నిఫ్టీ సూచీ 99 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 339 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 223 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.

కారణం ఏమిటి..?
నేడు భారత మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవటానికి కొన్ని కారణాలు కీలకంగా మారాయి. ఇందులో ముందుగా అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో ముగియటం ఒకటి. దీనికి తోడు రానున్న ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును మూడీస్ 5.6 శాతానికి పరిమితం చేయటం కొంత ఆందోళనలను పెంచుతోంది.అయితే ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే ఇండియా ఆర్థికంగా మెరుగైన పనితీరును కనబరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో హిందాల్కొ, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, మారుతీ, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
అదానీ పోర్ట్స్, ఎస్బీఐఎన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్ ప్రైజస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications