For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: నష్టాల్లో ప్రారంభమై మార్కెట్ల ఊగిసలాట.. US మార్కెట్ ఎఫెక్ట్..

|

Stock Market: నెల చివరి వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభించాయి. ప్రీఓపెన్ సెషన్లో సైతం మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా మార్కెట్లలో నెలకొన్న ఓలటాలిటీ దీనికి కారణంగా తెలుస్తోంది.

ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు ఆ తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ 85 పాయింట్లు, నిఫ్టీ సూచీ 34 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ 22 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 49 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.

 stocklosses

ప్రధానంగా అమెరికా డెట్ సీలింగ్ పై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే ఆందోళనలు దేశీయ మార్కెట్లను కొంత ప్రభావితం చేస్తున్నాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగటం, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించటం కూడా నెగటివ్ ఓపెనింగ్ కు కారణాలుగా ఉన్నాయి.

NSE సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, టైటాన్, దివీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, విప్రో, సిప్లా, మారుతీ, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్, గ్రాసిమ్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.

English summary

Stock Market: నష్టాల్లో ప్రారంభమై మార్కెట్ల ఊగిసలాట.. US మార్కెట్ ఎఫెక్ట్.. | Indian stock markets in volatality as US markets closed red asia markets trading flat

Indian stock markets in volatality as US markets closed red asia markets trading flat
Story first published: Monday, May 22, 2023, 9:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X