పెరిగిన రైల్వే ఛార్జీలు, ఏ క్లాస్‌కు ఎంత పెరిగిందంటే? సబర్బన్ రైళ్లకు నో పెంపు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరవేళ ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకులకు షాకిచ్చింది. రైల్వే ఛార్జీలను స్వల్పంగా పెంచారు. అయితే ఈ ఛార్జీలు అతి స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ఛార్జీలు జనవరి 1, 2020 నుంచి అమలులోకి వస్తున్నాయి. ఇప్పటికే టిక్కెట్స్ బుక్ చేసుకున్న వారికి మినహాయింపు ఉంది. ఛార్జీలు పెరగడానికి ముందే టిక్కెట్స్ బుక్ చేసుకున్నందున వారు ఎక్కువగా చెల్లించవలసిన అవసరం మాత్రం లేదు.
అయితే ఈ (డిసెంబర్ 31) అర్ధరాత్రి నుంచి టిక్కెట్ కొనుగోలు చేసేవారికి మాత్రం పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. రైల్వే ఛార్జీలను రేషనలైజ్ చేస్తామని చెప్పడం ద్వారా ఇటీవల రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే యాదవ్ ఛార్జీల పెంపుపై హింట్ ఇచ్చారు.

ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌కు కిలో మీటర్‌కు ఒక పైస చొప్పున పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మెయిల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్‌కు కిలో మీర్‌కు రూ.2 పైసల చొప్పున పెంచారు. ఏసీ చైర్ కార్, ఏసీ 3, 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు కిలో మీటరుకు 4 పైసల చొప్పున పెంచారు. అయితే సబర్బన్ రైళ్లలో మాత్రం ఛార్జీలు పెంచలేదు. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక 2014లో రైల్వే ఛార్జీలు పెంచారు. అప్పుడు ప్రయాణ ఛార్జీలు 14.2 శాతం, సరకు రవాణా ఛార్జీలు 6.5 శాతం మేర పెరిగాయి.
చదవండి: బ్యాడ్ న్యూస్: పెరగనున్న రైలు చార్జీలు, ఎంతో తెలుసా?


Click it and Unblock the Notifications