భారతీయ రైల్వే... రోజుకు కొన్ని కోట్ల మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్లాలన్నా సామాన్యుడి ప్రయాణ సాధనం కచ్చితంగా రైల్వేనే. తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణం చేయగల ఏకైక మార్గం రైలు బండి. కానీ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రయాణికులకు భారీ షాక్ ఇవ్వబోతోంది. రైలు చార్జీలు పెంచబోతోంది.
పాసెంజర్ల పై అధిక భారం మోపబోతోంది. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన ప్రభావంతో ఇండియన్ రైల్వేస్ కు కూడా ఆదాయం పడిపోతోందట. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందట. చేపట్టిన ప్రాజెక్టులను సమయానుకూలంగా పూర్తిచేయలేక పోవటంతో ఇప్పుడిక తప్పనిసరి పరిస్థితిలో రైల్వే పాసెంజర్ల పై చార్జీల వడ్డనకు రంగం సిద్ధం చేస్తోంది. అతి త్వరలోనే రైలు చార్జీల పెంపు నిర్ణయం అధికారికంగా ప్రకటించబోతోంది. ఈ విషయాన్నీది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.

కిలో మీటర్ కు 40 పైసలు...
ఇండియన్ రైల్వేస్ కు ప్రధానంగా రెండు మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఒకటి ప్రయాణికుల చార్జీలు కాగా రెండోది సరుకు రవాణా. అయితే ఇప్పటికే సరుకు రవాణా చార్జీలు అధికంగా ఉన్న నేపథ్యంలో వాటి చార్జీలను పెంచే ఉద్దేశం తమకు లేదని, అవసరమైతే తగ్గించాలని యోచిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ న్యూ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో చెప్పారు.
పాసెంజర్ చార్జీలు, ఫ్రైట్ (సరుకు) రవాణా చార్జీల క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలైందని ఆయన వెల్లడించారు. అయితే రోడ్డు రవాణా నుంచి సరుకును ఆకర్షించేందుకు ఫ్రైట్ చార్జీలను తగ్గించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా పాసెంజర్ చార్జీల పెంపును ప్రస్తావించిన యాదవ్... అవి ఎంత మేరకు పెరుగుతాయో వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అన్ని విభాగాల్లో సగటున కిలోమీటర్ కు 40 పైసల చొప్పున పెంపుదల ఉండే అవకాశం ఉందని తెలిసింది. అంటే ప్రతి 100 కిలోమీటర్ల ప్రయాణానికి మరో రూ 40 వరకు అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

పెన్షన్ భారం...
భారతీయ రైల్వే దేశానికి సమున్నతమైన సేవలు అందిస్తున్నప్పటికీ తమ ఆదాయవనరులు మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాయని వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తమను పెన్షన్ల భారం అధికంగా వేధిస్తోందని చెప్పారు. రైల్వేస్ లో ప్రస్తుతం 12 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా... 13 లక్షల మంది పెన్షన్ తీసుకునే వారు ఉన్నారని తెలిపారు. దీంతో పెన్షన్ చెల్లింపుల భారం అధికమవుతోందన్నారు.
అందుకే కేంద్ర ఆర్థిక శాఖ కొంత మేరకు ఈ భారాన్నితగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే 2021 నుంచి అమలు చేయబోతున్న యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ప్రకారం కొత్త రిక్రూట్మెంట్ ఉంటుందని, ప్రస్తుత ఉద్యోగులు పునర్వ్యవస్థీకరణ లో భాగంగా ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోబోరని అయన హామీ ఇచ్చారు.

ఉద్యోగుల్లో భయాలు...
ఇదిలా ఉండగా రైల్వేస్ ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది. అయితే వాటిని పోగొట్టి, వారిలో ఆత్మ విశ్వాసం నింపేందుకు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఇటీవల ఒక ట్వీట్ చేసారు. క్యాడర్ తో సంబంధం లేకుండా అందరు అధికారులకు వారి సామర్థ్యం, సీనియారిటీ ప్రకారం రైల్వే బోర్డు లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. 8,400 మంది అధికారులకు ప్రమోషన్ కల్పించేందుకు తమవద్ద ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని గోయెల్ తెలిపారు. అందుకే వారు ఎటువంటి భయాందోళనలకు గురి కావొద్దని సూచించారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications