For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020లో ఐటీ సేవలు కాస్త నెమ్మదించాయి, కానీ వీటికి భవిష్యత్తు!

|

ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ వృద్ధి 2020 క్యాలెండర్ ఏడాదిలో ఏడాది ప్రాతిపదికన 5.41 శాతంగా మాత్రమే నమోదయింది. ఈ మేరకు ఐడీసీ నివేదిక మంగళవారం వెల్లడించింది. అంటే గత ఏడాది ఐటీ సేవల మార్కెట్ కాస్త నెమ్మదించింది. 5.41 శాతం వృద్ధితో 13.41 బిలియన్ డాలర్లుగా నమోదయింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది వృద్ధి క్షీణించినట్లు ఈ నివేదిక తెలిపింది. అయితే ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ వృద్ధి 2020-25 మధ్య కాలంలో 7.18 శాతం నమోదు కావొచ్చునని అంచనా వేసింది. తద్వారా ఇది 19 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు.

ఎలాన్ మస్క్ టెస్లా కీలక నిర్ణయం, 3 నెలల తర్వాత బిట్ కాయిన్ భారీ పతనంఎలాన్ మస్క్ టెస్లా కీలక నిర్ణయం, 3 నెలల తర్వాత బిట్ కాయిన్ భారీ పతనం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌కు ప్రాధాన్యత

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌కు ప్రాధాన్యత

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ వంటి వాటికి ప్రాధాన్యత పెరుగుతోందని, దీంతో 2020-2025 మధ్య కాలంలో వృద్ధి ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. 2019లో ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ వృద్ధి 8.43 శాతంగా నమోదైంది. కానీ కరోనా కారణంగా 2020లో నెమ్మదించింది. 2020-2025 మధ్య ఈ మార్కెట్ 7.18 శాతం వార్షిక వృద్ధితో 18.97 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని అంచనా వేసింది. క్లౌడ్, ఆటోమేషన్ కృత్రిమ మేధపై పెట్టుబడులను కంపెనీలు పెంచుతున్నాయని, ఇది దోహదపడుతుందని తెలిపింది.

డిజిటల్ దిశగా అడుగులు

డిజిటల్ దిశగా అడుగులు

2021 నుండి ఐటీ అండ్ బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ క్రమంగా పుంజుకొని, మంచి వృద్ధిని నమోదు చేస్తుందని ఐడీసీ అంచనా వేసింది. అన్ని రంగాల్లోని కంపెనీలు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు కంపెనీలన్నీ వ్యయ కేటాయింపులు చేయడాన్ని ప్రారంభించాయని తెలిపింది. ముఖ్యంగా కరోనా అనంతరం ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని తెలిపింది.

క్లౌడ్ ఆధారిత అప్లికేషన్స్

క్లౌడ్ ఆధారిత అప్లికేషన్స్

కరోనా ప్రారంభంలో తీవ్రంగా ప్రభావానికి లోనైన తయారీ రంగం కూడా క్లౌడ్ ఆధారిత అప్లికేషన్స్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. ఎక్కడి నుండి అయినా పని చేసేందుకు కంపెనీలు ఉద్యోగులకు వెసులుబాటు కల్పించడం, ఆన్‌లైన్ క్లాస్‌లు, ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ పెరగడం వంటి మార్పులు చోటుచేసుకోడంతో క్లౌడ్ ఆధారిత సేవలకు డిమాండ్ పెరిగినట్లు తెలిపింది.

English summary

2020లో ఐటీ సేవలు కాస్త నెమ్మదించాయి, కానీ వీటికి భవిష్యత్తు! | Indian IT and Business Services market grew 5.41 percent in 2020, IDC says

The IT and Business Services market in the country recorded a lower year-on-year growth of 5.41 per cent to USD 13.41 billion in 2020 due to the impact of the COVID-19 pandemic on organisations, research firm IDC said on Tuesday.
Story first published: Wednesday, May 19, 2021, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X