'మోడీగారూ! చైనా నుండి కంపెనీలు వెళ్లిపోతున్నాయి, ఈ గొప్ప అవకాశం వదులుకోవద్దు'
కరోనా మహమ్మారి అనంతరం చైనా నుండి పలు కంపెనీలు అక్కడి నుండి విదేశాలకు తరలి వెళ్లాలని భావిస్తున్నాయి. గత క్యాలెండర్ ఇయర్లో అమెరికాతో ట్రేడ్ వార్ కారణంగా వెళ్లిపోవాలనుకుంటే, ఇప్పుడు కరోనా నేపథ్యంలో కంపెనీలు ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఈ అంశంపై భారత్ జాగ్రత్త పడాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్ (FIEO) సూచిస్తోంది.

పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇలా
చైనా నుండి వెళ్లిపోవాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని FIEO ఓ లేఖలో సూచించింది. ఇందుకు పలు సూచనలు చేసింది. సకాలంలో లైసెన్స్ మంజూరు, అనుమతులు, భూసేకరణ చట్టంలో మార్పులు, నెలలో విద్యుత్ కనెక్షన్, రెండు నెలల్లో బ్యాంకు రుణ మంజూరు అంశాలను పేర్కొంది.

ప్రస్తుతం ఆరు నెలలు పడుతోంది
ఖాళీగా ఉన్న భూమి లభిస్తే అన్ని రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు కూడా దరఖాస్తుదారుకు ఒక నెలలో భూకేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం భూకేటాయింపునకు ఆరు నెలల సమయం తీసుకుంటోందన్నారు. వ్యవసాయేతర భూమిని నెల రోజుల్లో అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని మోడీకి FIEO ప్రెసిడెంట్ ఎస్ సరఫ్ అన్నారు.

ఇలా చేయండి..
కరోనా నేపథ్యంలో చైనా నుంచి తమ తయారీ కేంద్రాలను మార్చాలని చూస్తున్న సంస్థలను ఆకర్షించేందుకు ఇదిసరైన సమయమని FIEO అభిప్రాయపడింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి 10 కి.మీ. పరిధిలో ఉన్న అటవీ భూముల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని, మరో అటవీ భూమిలో పరిశ్రమ యాజమాన్యాలతో మొక్కలు నాటించాలని, దీనివల్ల గ్రామీణ ప్రజలకు ఉపాధి లభిస్తుందని తెలిపింది. ప్రస్తుతం భారీ సంస్థలే భారత్‌కు వస్తున్నాయని, క్షేత్రస్థాయి సమస్యలను తీర్చితే చిన్న, మధ్యతరహా సంస్థలూ దేశంలోకి వస్తాయని తెలిపింది.

మధ్య, చిన్న తరహా పెట్టుబడులు కూడా వస్తాయి
తమ జిల్లాల్లో పెట్టుబడులను పెంచే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని విదేశీ పెట్టుబడులు కష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భూమి వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం దేశానికి పెద్ద కంపెనీలు మాత్రమే వస్తున్నాయని, భూస్థాయి సమస్యలు పరిష్కరిస్తే మధ్య, చిన్న తరహా పరిశ్రమలు కూడా వస్తాయని తెలిపారు.

ఇప్పటికే జపాన్ భారీ నిధులు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా చైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాగే చేసిందని తెలిపారు. ఇప్పటికే చైనా నుండి వచ్చే తమ పరిశ్రమలకు జపాన్ 2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించిందని, ఇతర పరిశ్రమలను ఆకర్షించేందుకు భారత్ కూడా అలా చేయాలన్నారు.

సర్.. ఇది గొప్ప అవకాశం.. జారవిడుచుకోవద్దు
అమెరికా, యూరోప్ దేశాలకు చెందిన కంపెనీలు కూడా చైనా నుండి వెలుపలికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని FIEO ప్రెసిడెంట్ తెలిపారు. 'సర్! ఇది మనకు గొప్ప అవకాశం. ఇది పెట్టుబడులను ఆకర్షించే సమయం. సరైన చర్యలు తీసుకోలేకుంటే అవకాశం కోల్పోతాం. చైనా నుండి ఇతర ఆసియా దేశాలకు వెళ్లాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తక్షణ స్వల్పకాలిక కార్యాచరణ ప్రణాళికతో ఉండాలని, సూచిస్తున్నాం.' అని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications