మే నెలలో భారత్ నుండి ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 67 శాతం పెరిగి 32.21 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం వాణిజ్యలోటు ఎనిమిది నెలల కనిష్టానికి చేరుకుంది. ఇంజినీరింగ్, పెట్రోలియం, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ అత్యధికంగా ఎగుమతి అయినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 19.24 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. ఇదే నెలలో 38.53 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంది. దీంతో వాణిజ్య లోటు 6.32 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
గత నెలలో 9.45 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి అయింది. మే 2020 నెలలో అయిన 3.57 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ఏప్రిల్-మే రెండు నెలల్లో ఎగుమతులు 62.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 84.25 బిలియన్ డాలర్లు దిగుమతులు నమోదయ్యాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వజ్రాల ఎగుమతులు 20 శాతం మేర వృద్ధి చెంది 2,000 కోట్ల డాలర్ల స్థాయిని దాటవచ్చునని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. అగ్రరాజ్యాలు కరోనా సంక్షోభం నుండి క్రమంగా కోలుకుంటుండటం ఇందుకు దోహదపడనుందని నివేదికలో పేర్కొంది.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం..ప్రమాదంలో భారత బాస్మతి బియ్యం ఎగుమతులు..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications