దేశీయ ఎగుమతులు మార్చి నెలలో 58.23 శాతం ఎగిసి 34 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కామర్స్ మినిస్ట్రీ ప్రొవిజనల్ డేటా ప్రకారం ఇంజినీరింగ్, జెమ్స్, జ్యువెల్లరీ, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకోవడం వంటి వివిధ అంశాల నేపథ్యంలో ఎగుమతులు జంప్ చేశాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మార్చి కాలంలో ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 313.36బిలియన్ డాలర్లుగా నమోదయింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 18 శాతం క్షీణించి 388.92 బిలియన్ డాలర్లు నమోదు కాగా, అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో 474.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మార్చి 2020 నెలలో ఎగుమతులు 21.49 డాలర్లు నమోదయ్యాయి. మార్చి 2019తో పోలిస్తే 34 శాతం క్షీణించింది.

ఇండియా మర్చంటైజ్డ్ ఎగుమతులు మార్చి 2020లో 21.49 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది మార్చిలో 34.0 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంటే 58.23 శాతం వృద్ధిని నమోదు చేసింది. నెల ప్రాతిపదికన ఇంత వృద్ధి నమోదు కావడం ఇది మొదటిసారి. ఎగుమతులు 34 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. దిగుమతులు కూడా 52.89 శాతం ఎగిసి 48.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 31.47 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications