కరోనా మహమ్మారి, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా సహా వివిధ దేశాల నుండి వస్తువుల దిగుమతులు సాధ్యమైనంత తగ్గించాలని ప్రభుత్వం, ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, వియత్నాం, కొరియా నుండి దిగుమతి చేసుకునే కొన్ని ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. తద్వారా నాణ్యతలేని, తక్కువ ధరకు దిగుమతయ్యే ఉత్పత్తులనుండి దేశీయ తయారీదారులకి ఊరట లభిస్తుంది. ఈ మూడు దేశాల నుండి స్టీల్ ఫ్లాట్-రోల్డ్ స్టీల్ ఉత్పత్తులు, ప్లేటెడ్ లేదా కోటెడ్ అల్యూమినియం, జింక్ దిగుమతులపై టన్నుకు 13.07 డాలర్ల నుండి 173.1 డాలర్ల వరకు సుంకం విధిస్తోంది.

ఐదేళ్ల పాటు
వాణిజ్య మంత్రిత్వ శాఖ దర్యాఫ్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) ఈ అంశంపై దర్యాఫ్తు చేసిన అనంతరం, దీని వల్ల మన దేశ సంస్థలకు నష్టం జరుగుతుందని నిర్ణయానికి వచ్చాకే ఈ దేశాల నుండి సుంకాలు విధించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం యాంటీ డంపింగ్ డ్యూటీ విధించిన అక్టోబర్ 15, 2019 నుండి ఐదేళ్ల పాటు ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య పరిభాషలో చెప్పాలంటే.. ఏదైనా దేశం లేదా కంపెనీ దేశీయ మార్కెట్లో ఓ వస్తువు ఉత్పత్తి ధర కంటే తక్కువ ధరకు వస్తువును ఎగుమతి చేయడాన్ని డంపింగ్‌గా చెప్పవచ్చు. అలా చేయడం వల్ల దిగుమతి చేసుకున్న దేశంలో ధరలపై ప్రభావం పడుతుంది. అంతేకాదు, డొమెస్టిక్ కంపెనీల లాభాలపై, ఉత్పత్తి సంస్ధలపై ప్రభావం పడుతుంది.

భారత్ వ్యూహాత్మకంగా...
అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం అలా డంప్ చేసిన ఉత్పత్తులపై దిగుమతి చేసుకునే దేశం టారిఫ్ విధించుకునే హక్కను కలిగి ఉంటుంది. అందుకే DGTR సమగ్ర విచారణ అనంతరమే ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది భారత్. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనల ప్రకారం డంపింగ్ డ్యూటీ విధించవచ్చు. తద్వారా ఫెయిర్ ట్రేడింగ్‌తో పాటు దేశీయ ఉత్పత్తిదారులకు మద్దతుగా ఉంటుంది. ఇప్పుడు ఈ అంతర్జాతీయ నిబంధనలను ఉపయోగించే భారత్ వ్యూహాత్మకంగా ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది.

చాలా మంచి నిర్ణయం
భారత్ చాలా మంచి నిర్ణయం తీసుకుందని, తక్కువ ధరలకే డంపింగ్ చేయడాన్ని ఇది నిరోధిస్తుందని, తద్వారా మన దేశంలో అన్యాయమైన లేదా అన్-ఫెయిర్ వాణిజ్యాన్ని అడ్డుకున్నట్లుగా అవుతుందని జేఎస్‌డబ్ల్యు స్టీల్ డైరెక్టర్ కమర్షియల్ జయంత్ ఆచార్య అన్నారు.

చైనా 7 రెట్లు ఎక్కువ, మన సుంకాలే తక్కువ
చైనా - భారత్ సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో వాణిజ్యానికి సంబంధించి పలు అంశాలు తెలుస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో భాగంగా భారత్ కంటే చైనా 7 రెట్ల వస్తువుల దిగుమతిని నిషేధిస్తోంది. అంతేకాదు ఆసియా దేశాల్లో భారత్ అతి తక్కువ సుంకాలు కలిగిన దేశం. ఈ విషయాలు గుర్తించిన మోడీ ప్రభుత్వం చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువుల జాబితాను తయారు చేయడం ప్రారంభించిందట. భారత వ్యాపారులపై ప్రభావం పడకుండా ఉంటుందని చెబుతున్నారు.

టారిఫ్.. చైనా టాఫ్
సరిహద్దులోనే కాదు ఆర్థికరంగంలోను భారత్ పైన చైనా యుద్ధంలాంటి వాతావరణం సృష్టించిందని చెప్పవచ్చు. ఆసియాలో అత్యధిక సుంకాలు కలిగిన దేశంగా చైనా నిలిచింది. అతి తక్కువ సుంకాలు భారత్‌వే. చైనా నుండి భారత్ కంటే, మన దేశం నుండి ఆ దేశానికి వెళ్లే ఉత్పత్తుల లిస్టు ఇక్కట్లు ఎక్కువగా ఉన్నాయి. చైనా 2848 వస్తువులపై దిగుమతి సుంకం విధిస్తుంది. భారత్ 433 వస్తువులపై విధిస్తుంది. జపాన్ 1671, థాయ్‌లాండ్ 1169 వస్తువులపై సుంకం విధిస్తాయి.
More From GoodReturns

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications