కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఉపశమనం ఇచ్చింది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలును జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలుకు నవంబర్ 30వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు - ఆధార్ కార్డు అనుసంధానం గడువును కూడా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది.

పెట్టుబడులు, డిడక్షన్ క్లెయిమ్స్ గడువు పెంపు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) కూడా నోటిఫికేషన్ ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పెట్టుబడులు, ఐటీ చట్టం ప్రకారం డిడక్షన్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి గడువు జూలై 31, 2020 వరకు పెంచింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఐటీ రిటర్న్స్, పాన్-ఆధార్ లింక్ వంటి వాటికి గడువును కూడా పొడిగిస్తోంది.

వివిధ ఆదాయపు పన్ను డెడ్‌లైన్స్
- 2018-19 (అసెస్‌మెంట్ ఇయర్ 2019-20) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు 31 జూలై 2020 వరకు పొడిగింపు.
- 2019-20 (AY2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు 30 నవంబర్, 2020 వరకు పొడిగింపు.
- అంటే 31 జూలై 2020, 31 అక్టోబర్ 2020 లోపు దాఖలు చేయాల్సిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు మరింత వెసులుబాటు (నవంబర్ 30) లభించింది.
- పన్ను ఆడిట్ రిపోర్ట్ నివేదిక గడువు 31 అక్టోబర్ 2020కి పొడిగించారు.

క్లెయిమ్స్
- సెక్షన్ 80సీ (ఎల్ఐసీ, పీపీఎఫ్, ఎన్ఎస్సీ మొదలగునవి), 80డీ (మెడిక్లెయిమ్), 80జీ డొనేషన్స్ తదితరాలకు సంబంధించి మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి తేదీని 31 జూలై 2020కి పొడిగించారు.
- ఐటీ చట్టంలోని సెక్షన్ 54 నుండి 54జీబీ కింద మూలధన లాభాలకు సంబంధించి రోలోవర్ బెనిఫిట్స్, డిడక్షన్‌పై పెట్టుబడులు, నిర్మాణం, కొనుగోళ్ల క్లెయిమ్స్ తేదీని 30 సెప్టెంబర్ 2020 వరకు పొడిగించారు. కాబట్టి మూలధన లాభాల నుండి తగ్గింపును పొందేందుకు సెప్టెంబర్ చివరి వరకు వెసులుబాటు లభిస్తోంది.
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి టీడీఎస్/టీసీఎస్ సర్టిఫికెట్స్ జారీని వరుసగా జూలై 31, 2020, ఆగస్ట్ 15, 2020కి పొడిగించారు.


Click it and Unblock the Notifications