గుడ్ న్యూస్: హమ్మయ్య... మళ్ళీ హైరింగ్ పెరుగుతోంది!

కరోనా వైరస్ వ్యాప్తి ... సుదీర్ఘ లాక్ డౌన్ అనంతరం తొలిసారి ఒక మంచి వార్త మన చెవిన పడుతోంది. ఈ వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలు, ప్రజలు చితికిపోయారు. కానీ.. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు కుదుటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే హైరింగ్ లో కాస్త కదలిక వచ్చింది. గత పదిహేను రోజులుగా కొన్ని రంగాల వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్లు ప్రముఖ హెచ్ ఆర్ సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పటికే బాగా దెబ్బతిని, ఆర్థికంగా, మానసికంగా దెబ్బతిన్న ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా లేదా ... పోయిన ఉద్యోగాలు తిరిగి వస్తాయా లేదా ... అసలు చేయటానికి ఏమైనా పనులు దొరుకుతాయా లేదా... భవిష్యత్ లో బతకటం ఎలా అన్న భయాందోళనలు ప్రజల మనస్సులో బలంగా నాటుకుపోయాయి.

వలస కూలీల నుంచి సాఫ్ట్ వేర్ కొలువుల వరకు అందిరిదీ ఇదే పరిస్థితి. ఓ వైపు ఉద్యోగులకు ఉద్వాసన పలకటం, మరో వైపు జీతాల్లో కోతలు విధించటం సర్వ సాధారణం అయిపోయింది. ఈ పరిస్థితులు ఎంత భయానకంగా తరయారయ్యాయంటే... వేలల్లో వేతనాలు తీసుకునే స్థాయి నుంచి రోజు కూలీలుగా మారిన వారి ఉదంతాలు కూడా కనిపించాయి.

ఆ రంగాలు మెరుగు...

ఆ రంగాలు మెరుగు...

కరోనా వైరస్ ఉధృతి సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు రెండు నెలలు లాక్ డౌన్ విధించారు. దీంతో హైరింగ్ పూర్తిగా దెబ్బతింది. అన్ని రంగాల్లోనూ సుమారు 80% వరకు ఉద్యోగ నియామకాలు తగ్గిపోయాయి. అయితే, గత రెండు వారాలుగా హైరింగ్ లో కాస్త కదలిక కనిపిస్తోంది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఈ కామర్స్, డేటా ప్రాసెసింగ్, సప్లై చైన్ మానేజ్మెంట్, బ్యాంకింగ్, ఎఫ్ ఎం సి జి, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, డిజిటల్ ఎక్స్పర్ట్స్, ఫిన్ టెక్, ఫార్మా రంగాల్లో హైరింగ్ పెరుగుతోంది.

కరోనాకు ముందు పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు హరింగ్ లో 50% వరకు జరుగుతోందని, ఈ రంగాల్లో మళ్ళీ నియామకాలు పుంజుకుంటున్నాయని సి ఐ ఈ ఎల్ హెచ్ ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆదిత్య మిశ్ర వెల్లడించారు. ఈ కంపెనీకి దేశంలో 39 ప్రాంతాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కొన్ని రంగాల్లో హైరింగ్ పెరుగుతున్నప్పటికీ... టూరిజం వంటి రంగాల్లో మాత్రం అది ఇప్పుడప్పుడే పుంజుకోకపోవచ్చని మిశ్ర అభిప్రాయపడ్డారు.

ఈ నెలాఖరు వరకు...

ఈ నెలాఖరు వరకు...

జూన్ నెలాఖరు వరకు కొన్ని రంగాల్లో హైరింగ్ మళ్ళీ కరోనా కు ముందు స్థాయి కి చేరుకోవాల్సి ఉంటుందని, అయితే ఏవియేషన్, టూరిజం, ఆతిథ్య రంగాలు మాత్రం వాటి పూర్వ స్థితికి చేరుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ప్రముఖ మానవ వనరుల సేవల సంస్థ రాండ్ స్టడ్ ఇండియా స్ట్రాటజిక్ అకౌంట్ మానేజ్మెంట్ హెడ్ సంజయ్ శెట్టి పేర్కొన్నారు. అయితే, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం రంగాల్లో మాత్రం పికప్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

అదే జరిగితే కొన్ని రంగాలు మినహా మిగితా రంగాలు కాస్త గాడిన పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో మళ్ళీ ఉద్యోగుల్లో కాస్త భరోసా పెరిగి జీవితం మీద ఆశ కలుగుతుంది. లేదంటే ప్రజలు మానసికంగా బాగా దెబ్బతింటారని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

డాక్టర్లు, నర్సులకు హై డిమాండ్...

డాక్టర్లు, నర్సులకు హై డిమాండ్...

కరోనా వైరస్ తో దేశంలో ఒక్కసారిగా డాక్టర్లు, నర్సులకు డిమాండ్ పెరిగిపోయింది. పారామెడికల్ స్టాఫ్ తో పాటు హెల్త్ కేర్ రంగంలోని మిగితా విభాగాల ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. వేర్ హౌస్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్షన్, సేల్స్, లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ కు డిమాండ్ పుంజుకుంటోంది. డిజిటల్ మార్కెటీర్లు, టెక్నాలజీ ఎక్స్పర్ట్ లకు క్రమంగా డిమాండ్ ఊపందుకుంటుందని హెచ్ ఆర్ నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా... ఉద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇంకా కంపెనీలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించలేదని, అవి పూర్తి స్థాయిలో ఉద్యోగులను నియమించుకునే బదులు అవసరానికి తగ్గట్టు మాత్రమే హైరింగ్ చేపడుతున్న విషయాన్ని గుర్తించాలని టీం లీజ్ సంస్థ కో-ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రీతూపర్ణ చక్రబోర్తి అభిప్రాయపడ్డారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+