For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో నెల రోజులు.. బంగారం హాల్ మార్కింగ్: కేంద్రం ఏం చెప్పిందంటే

|

బంగారం హాల్‌మార్కింగ్ తప్పనిసరి నిబంధనలను జూన్ 1వ తేదీ నుండి అమలులోకి తేనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది ఐచ్ఛికం. అయితే జూన్ 1వ తేదీ నుండి తప్పనిసరి కానుంది. ఇప్పటికే పెద్ద పెద్ద ఆభరణాల విక్రయశాలలు హాల్ మార్కింగ్ నగలను విక్రయిస్తున్నాయి. హాల్ మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తామని కేంద్రం 2019 నవంబర్ నెలలో ప్రకటించింది. జ్యువెల్లరీ జ్యువెల్లరీ బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం కోరింది. ఇందుకు 2021 జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో గడువును జూన్ 1వ తేదీ వరకు పొడిగించింది.

అదానీ పోర్ట్స్‌కు అమెరికా ఎస్&పీ షాక్, లిస్టింగ్ నుండి తొలగింత!అదానీ పోర్ట్స్‌కు అమెరికా ఎస్&పీ షాక్, లిస్టింగ్ నుండి తొలగింత!

ఎంతమంది నమోదు చేసుకున్నారంటే

ఎంతమంది నమోదు చేసుకున్నారంటే

34,647 మంది జ్యువెల్లరీ దుకాణాలు ఇప్పటి వరకు తమ వద్ద వివరాలు నమోదు చేసుకున్నట్లు BIS డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. వచ్చే రెండు నెలల్లో లక్షమంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్పారు. హాల్‌మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాక జ్యువెల్లర్లు కేవలం 14, 18, 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన స్వర్ణాభరణాలను విక్రయించవచ్చు.

హాల్ మార్కింగ్ ఇలా..

హాల్ మార్కింగ్ ఇలా..

BIS హాల్‌మార్కింగ్ స్కీంలో ఆభరణాలకు రిజిస్ట్రేషన్ మంజూరు, అస్సైయింగ్ అండ్ హాల్ మార్కింగ్(A&H)కు గుర్తింపు ఉంటుంది. ఆభరణాల హాల్ మార్కింగ్ ప్రక్రియలో BIS-A&H సెంటర్‌లో నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం A&H సెంటర్‌లో హాల్ మార్కింగ్ ముద్రను వేస్తారు. రిజిస్టర్డ్ జ్యువెల్లర్స్ హాల్ మార్కింగ్ కోసం BIS రికగ్నైజ్డ్ A&H సెంటర్‌కు ఆభరణాలను ఇస్తే, పరీక్ష అనంతరం హాల్ మార్కింగ్ వేస్తారు.

దరఖాస్తు

దరఖాస్తు

BIS జ్యువెల్లర్స్ రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేసింది. ఈ పూర్తి ప్రక్రియ కూడా మ్యాన్యువల్‌గా కాకుండా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. జ్యువెల్లర్స్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఇందుకు వ్యాపారులు e-BIS పోర్టల్ www.manakonline.in కి వెళ్లాలి. సంబంధిత పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తుదారు BIS రిజిస్టర్డ్ జ్యువెలర్ అవుతారు. BIS రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తక్కువగా నిర్ణయించారు. టర్నోవర్ రూ.5 కోట్ల కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7500, రూ.5 కోట్ల నుండి 25 కోట్లు టర్నోవర్ అయితే రూ.15,000, రూ.25 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.40 వేలు చెల్లించాలి. టర్నోవర్ రూ.100 కోట్లు దాటితే రూ.80 వేలు చెల్లించాలి. హాల్ మార్క్‌కు గతంలో 15 జనవరి 2021 వరకు గడువు ఇచ్చారు. జ్యువెల్లరీ అసోసియేషన్ డిమాండ్ మేరకు జూన్ 1వ తేదీ వరకు పొడిగించారు.

English summary

మరో నెల రోజులు.. బంగారం హాల్ మార్కింగ్: కేంద్రం ఏం చెప్పిందంటే | Government to implement mandatory gold hallmarking from June 1

The government on Tuesday said it is fully prepared to implement mandatory hallmarking of gold jewellery and artefacts from June 1, 2021. Gold hallmarking is a purity certification of the precious metal and is voluntary in nature at present.
Story first published: Wednesday, April 14, 2021, 8:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X