For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold: చౌకగా బంగారం కొనేందుకు సిద్ధమా.. ఆ నాలుగు రోజులే అవకాశం.. పూర్తి వివరాలు..

|

Gold Bond Scheme: మీరు బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు ఒక ఈ నెల సదవకాశం అని చెప్పుకోవాలి. అధిక ధరల కారణంగా గోల్డ్ కొనలేకపోతున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఈ నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండవ సిరీస్ ఆగస్టు 22 నుంచి ప్రారంభమవుతోంది.

కొనుగోలుకు 5 రోజులే అవకాశం..

కొనుగోలుకు 5 రోజులే అవకాశం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం.. Gold Bond Scheme రెండవ సిరీస్ ఆగస్టు 22 నుంచి 26 వరకు తెరవబడుతుంది. అంటే ఈ ఐదు రోజుల పాటు తక్కువ ధరకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022-23 సిరీస్- 2 కోసం బంగారం ధరను ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు.

మెుదటి సిరీస్ రేటు వివరాలు..

మెుదటి సిరీస్ రేటు వివరాలు..

2022-23 ఆర్థిక సంవత్సరానికి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సిరీస్ జూన్ నెలలో ప్రారంభించబడింది. దీని కింద జూన్ 20 నుంచి 24 వరకు చౌకగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. మొదటి సిరీస్ సమయంలో బంగారం ధర గ్రాముకు రూ.5,091గా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

2015లో స్కీమ్ ప్రారంభం..

2015లో స్కీమ్ ప్రారంభం..

ఫిజికల్ గోల్డ్ డిమాండ్‌ను తగ్గించాలనే ఉద్దేశ్యంతో మొదటగా ప్రభుత్వ గోల్డ్ బాండ్ పథకాన్ని నవంబర్ 2015లో దేశంలో ప్రవేశపెట్టింది. దీని కింద ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 500 గ్రాముల బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు కేవలం ఒక్క గ్రాము నుంచి తమ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.

ఆన్‌లైన్ కొనుగోలుపై అదనపు తగ్గింపు..

ఆన్‌లైన్ కొనుగోలుపై అదనపు తగ్గింపు..

ఈ బంగారు బాండ్ కోసం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి డిజిటల్ మార్గంలో చెల్లించే పెట్టుబడిదారులు కూడా తగ్గింపు పొందుతారు. దీనివల్ల గ్రాముకు రూ.50 తగ్గింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ నిర్ణయించింది. దీనివల్ల ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం లాభదాయకమని చెప్పుకోవాలి.

ఎక్కడెక్కడి నుంచి కొనుగోలుచేయవచ్చు..

ఎక్కడెక్కడి నుంచి కొనుగోలుచేయవచ్చు..

భారత ప్రభుత్వం తరపున RBI ఈ బంగారు బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లను బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నియమించబడిన పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ వంటి గుర్తింపు పొందిన ఎక్స్ఛేంజీల ద్వారా ఇవి దేశంలో విక్రయించబడుతున్నాయి. సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి 3 పనిదినాల ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ జారీ చేసిన 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ధర ఆధారంగా బాండ్ ధర నిర్ణయించబడుతుంది.

English summary

Gold: చౌకగా బంగారం కొనేందుకు సిద్ధమా.. ఆ నాలుగు రోజులే అవకాశం.. పూర్తి వివరాలు.. | Government of india going to issue Gold Bond Scheme series 2 from august 20 to 24 for this financial year

get gold at lower price with Gold Bond Scheme from this month end
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X