For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices today: డాలర్, బాండ్ యీల్డ్స్ ఎఫెక్ట్, బంగారం ధరలు స్థిరంగా

|

ముంబై: ఇటీవల భారీగా పడిపోయిన పసిడి ధరలు గతవారం చివరలో పుంజుకున్నాయి. చాన్నాళ్లుగా రూ.45,000 దిగువనే ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఈ స్థాయిని క్రాస్ చేసింది. ఓ సమయంలో రూ.44వేల దిగువకు పడిపోయిన పసిడి ఇప్పుడు రూ.45,300 పైన ఉంది. ఇటీవలి కనిష్టం దాదాపు రూ.43,800తో పోలిస్తే రూ.1500 వరకు పెరిగింది. అమెరికా అధ్యక్షులు జోబిడెన్ 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం, నియామకాలు పుంజుకోవడం, డాలర్ బలపడటం వంటి వివిధ కారణాలు బంగారంపై ప్రభావం చూపుతున్నాయి.

హోంలోన్ కొనుగోలుదారులకు షాక్, వడ్డీ రేట్లు పెంచిన SBI: ఎంత ఉందంటే?హోంలోన్ కొనుగోలుదారులకు షాక్, వడ్డీ రేట్లు పెంచిన SBI: ఎంత ఉందంటే?

గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,000కు పైనే

గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,000కు పైనే

గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.45వేలను క్రాస్ చేసి రూ.45,418 వద్ద ట్రేడ్ అయింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.50.00 (0.11%) తగ్గి రూ.45,368.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,349.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,380.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,342.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఆగస్ట్ ఫ్యూచర్ దాదాపు స్థిరంగా ఉంది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45625.00 వద్ద ట్రేడ్ అయింది.

వెండి ధరలు

వెండి ధరలు

వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.176.00 (0.27%) క్షీణించి రూ.64913.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,800.00 వద్ద ప్రారంభమై, రూ.65,150.00 గరిష్టాన్ని, రూ.64,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.160.00 (-0.24%) తగ్గి రూ.65816.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,951.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,983.00 వద్ద గరిష్టానని, రూ.65,816.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు తగ్గాయి. అయినప్పటికీ 1725 డాలర్లకు పైనే ఉంది. 3.40 (-0.20%) డాలర్లు పెరిగి 1,725 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,724.45 - 1,730.80 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. 0.081 (-0.32%) డాలర్లు తగ్గి 24.867 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.837 - 25.098 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold Prices today: డాలర్, బాండ్ యీల్డ్స్ ఎఫెక్ట్, బంగారం ధరలు స్థిరంగా | Gold steady as inflation bets counter firm US dollar, yields

Gold prices held steady on Monday, buoyed by concerns over inflation after U.S. President Joe Biden announced a $2 trillion-plus jobs plan last week, while a stronger dollar and elevated U.S. Treasury yields limited bullion's upside.
Story first published: Monday, April 5, 2021, 11:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X