For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 రోజుల్లో రూ.1,000 పెరిగిన బంగారం ధర, వెండి ఒక్కరోజుల్లో షాకింగ్

|

బంగారం ధరలు భారీగా పెరిగాయి. యూఎస్ బాండ్ యీల్డ్స్, డాలర్ మరింత బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో 1 శాతానికి పైగా ఎగిసింది. గత కొద్ది రోజులుగా రూ.45వేలకు దిగువనే ఉన్న పసిడి ఈ వారం రూ.44,000 దిగువకు కూడా పడిపోయింది. కానీ తాజాగా మళ్లీ రూ.45,000 దిశగా వెళ్తోంది. వెండి ధరలు కూడా భారీగా షాకిచ్చాయి. రూ.వెయ్యికి పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి 1730 డాలర్లు దాటగా, వెండి 25 డాలర్ల స్థాయికి చేరుకుంది.

రెండ్రోజుల్లో రూ.1000 వరకు జంప్

రెండ్రోజుల్లో రూ.1000 వరకు జంప్

గోల్డ్ ఫ్యూచర్ నేడు (ఏప్రిల్ 1, 2021 గురువారం) సాయంత్రం సెషన్‌లో పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.228.00 (0.51%) పెరిగి రూ.44865.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,650.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,865.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,650.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,400 తక్కువ ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ రెండు రోజుల్లోనే రూ.1000 వరకు పెరిగింది. నిన్న రూ.44 వేల దిగువన ఉన్న ఫ్యూచర్ గోల్డ్, నేడు రూ.45,000 దిశగా వెళ్తోంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా భారీగా పెరిగింది. రూ.485.00 (1.08%) పెరిగి రూ.45420.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,911.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,911.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.1000 పెరిగింది

వెండి రూ.1000 పెరిగింది

వెండి ధరలు నేడు సాయంత్రం సెషన్లో రూ.1000కి పైగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,002.00 (1.57%) పెరిగి రూ.64816.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,614.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,887.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,512.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.942.00 (1.46%) తగ్గి రూ.65653.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,440.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,780.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,440.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మళ్లీ 1750 డాలర్ల దిశగా

మళ్లీ 1750 డాలర్ల దిశగా

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. నిన్న భారీగా తగ్గగా, నిన్న తిరిగి పుంజుకున్నాయి. ఇప్పుడు 1750 డాలర్ల దిశగా వెళ్తోంది. కామెక్స్‌లో +10.85 (+0.63%) డాలర్లు తగ్గి 1,726.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,677.50 - 1,731.05 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల దిశగా వెళ్తోంది. ఔన్స్ ధర +0.291 (+1.19%) డాలర్లు తగ్గి 24.832 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 23.793 - 24.885 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

2 రోజుల్లో రూ.1,000 పెరిగిన బంగారం ధర, వెండి ఒక్కరోజుల్లో షాకింగ్ | Gold rises around 1 percent as dollar, yields retreat

Gold rose over 1% on Thursday on a retreat in the dollar and U.S. bond yields, while grim jobless data raised prospects for a slower economic recovery and more stimulus that could spur demand for bullion as an inflation-hedge.
Story first published: Thursday, April 1, 2021, 22:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X