For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold rate today: భారీగా పెరిగి, స్థిరంగా బంగారం ధరలు

|

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న దాదాపు ముగిసిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ రోజు(శుక్రవారం, 21, 2022) ప్రారంభ సెషన్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.101 ఎగిసి రూ.48,481 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.86 ఎగిసి రూ.48,542 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1845 డాలర్లను సమీపించింది. నేడు మాత్రం అతి స్వల్పంగా 1.35 శాతం తగ్గి 1841.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. పసిడి ధర ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7700 తక్కువగా ఉంది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ ఏడాదిలో 2.28 శాతం క్షీణించింది. క్రితం సెషన్‌లో 1842 డాలర్లను క్రాస్ చేసింది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

వెండి ధరలు నిన్నటి వరకు భారీగా పెరిగి, నేడు స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.307 తగ్గి రూ.65,072వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.247 క్షీణించి రూ.65,718 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.228 డాలర్లు క్షీణించి 24.488 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏడాదిలో 5.78 శాతం క్షీణించింది. నేటి సెషన్‌లో 24.330 - 24.535 డాలర్ల మధ్య ట్రేడ్ అయిన సిల్వర్ ఫ్యూచర్స్, క్రితం సెషన్లో మాత్రం 24.716 డాలర్ల వద్ద ముగిసింది.

ఫెడ్ రిజర్వ్ నిర్ణయం

ఫెడ్ రిజర్వ్ నిర్ణయం

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంశం పసిడి పైన తీవ్ర ప్రభావం చూపింది. అమెరికా ద్రవ్యోల్భణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ రిజర్వ్ నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలు అప్రమత్తంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రెండు రోజుల క్రితం గోల్డ్ ఫ్యూచర్స్ 1840 డాలర్లను తాకింది. నిన్న, నేడు కూడా దాదాపు అదే స్థాయిలో ఉంది. ఫెడ్ రిజర్వ్ ఏం చేస్తుందనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

కొనుగోలు

కొనుగోలు

ఎంసీఎక్స్‌లో బంగారం నిరోధకస్థాయి రూ.48,000 వద్ద కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని రూ.48,500 టార్గెట్ ధరతో రూ.48,150 వద్ద కొనుగోలు చేయవచ్చునని, అలాగే రూ.47,800 టార్గెట్ ధరతో రూ.48,000 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

స్పాట్ గోల్డ్ క్రితం సెషన్‌లో ఔన్స్‌కు 1839.36 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నవంబర్ 22వ తేదీ తర్వాత ఇది గరిష్టం.

English summary

Gold rate today: భారీగా పెరిగి, స్థిరంగా బంగారం ధరలు | Gold rate today: Yellow metal rises Rs 100 to Rs 48,500 level, silver losses sheen

Gold prices were trading higher on Friday, on course for second consecutive weekly gain. Investors turned to safe-haven assets while awaiting signals on interest rate hikes from the US Federal Reserve's meeting next week.
Story first published: Friday, January 21, 2022, 10:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X