For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధర, రూ.48,000 దిగువకు! వెండి రూ.1500 డౌన్

|

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త! పసిడి ధరలు రూ.48,000 దిగువకు వచ్చాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8,200కు పైగా తక్కువ పలికింది. శుక్రవారం (నవంబర్ 27) దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.411 తగ్గింది. గత రెండు మూడు వారాలుగా పసిడి ధరలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం తర్వాత కొద్ది రోజుల్లోనే రూ.52వేలకు పడిపోయింది. ఆ తర్వాత దాదాపు మూడు నెలల పాటు పసిడి రూ.49,500 నుండి రూ.52,000 మధ్య కదలాడింది. ఇటీవల వ్యాక్సీన్ అనుకూల ప్రకటనల నేపథ్యంలో మరోసారి పతనమయ్యాయి.

ఈ నెలలోనే రూ.4,000 తగ్గుదల!

ఈ నెలలోనే రూ.4,000 తగ్గుదల!

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8,000కు పైగా తగ్గిన పసిడి ధర ఇటీవలి రూ.52,000తో చూసినా రూ.4,000 తగ్గింది. ఈ నెలలోనే ఈ తగ్గుదల నమోదయింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.411.00 (0.85%) క్షీణించి రూ.48,106 వద్ద ముగిసింది. రూ.48,508.00 వద్ద ప్రారంభమై, రూ.48,647.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.404.00 (-0.83%) క్షీణించి రూ.48114.00 వద్ద ముగిసింది. రూ.48,502.00 వద్ద ప్రారంభమై, రూ.48,670.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,820.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.1,100 తగ్గిన వెండి

రూ.1,100 తగ్గిన వెండి

వెండి ధరలు చాలా రోజుల తర్వాత రూ.58,000 దిగువకు వచ్చాయి. ఆ తర్వాత పెరుగుదలతో ముగిసింది. కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.773.00 (-1.29%) తగ్గి రూ.59,100 వద్ద ముగిసింది. రూ.59,507.00 వద్ద ప్రారంభమై, రూ.59,950.00 వద్ద గరిష్టాన్ని, రూ.57,877.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో వెయ్యికి పైగా తగ్గింది.

మార్చి ఫ్యూచర్స్ రూ.1,290.00 (-2.09%) క్షీణించి రూ.60,333 వద్ద ముగిసింది. రూ.61,299.00 వద్ద ప్రారంభమై, రూ.61,493.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,337.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో రూ.1500కు పైగా తగ్గింది.

1800 డాలర్ల కంటే దిగువకు బంగారం

1800 డాలర్ల కంటే దిగువకు బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. చాలా రోజులకు 1800 డాలర్ల దిగువకు వచ్చాయి. రెండు రోజులుగా 1800 డాలర్ల వద్ద ట్రేడ్ అయినప్పటికీ ఇప్పుడు ఆ మార్కు కంటే కిందకు వచ్చింది. ఔన్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 30.60 (-1.69%) డాలర్లు క్షీణించి 1,775 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,770.65 - 1,811.50 మధ్య నేడు ట్రేడ్ అయింది. ఏడాదిలో 22 శాతం పెరిగింది. క్రితం సెషన్లో 1,805.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఔన్స్ వెండి కూడా పతనమై 22.5 డాలర్లకు వచ్చింది. ఔన్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.807 (-3.45%) క్షీణించి 22.555 వద్ద డాలర్ల ట్రేడ్ అయింది. 22.332 - 23.330 మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో 23.362 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో సిల్వర్ 35 శాతం మేర పెరిగింది.

English summary

గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధర, రూ.48,000 దిగువకు! వెండి రూ.1500 డౌన్ | Gold rate today trade below Rs 48,000, Silver at Rs 58,000

Gold and silver futures were trading below Rs 48,000 per 10 gram and Rs 58,000 per KG respectivly in the evening trade on Friday.
Story first published: Saturday, November 28, 2020, 7:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X