For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.50 వేలకు టచ్: బంగారం కొనాలనుకుంటున్నారా? ఆలోచించాల్సిందే!

|

హైదరాబాద్: దేశవ్యాప్తంగా పసిడి రేట్లు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. బంగారం, వెండి ధరల్లో కొద్దిరోజులుగా నెలకొన్న క్షీణత స్తంభించింది. ఇక దాని గ్రాఫ్ పైకి ఎగబాకడం ఆరంభమైంది. శనివారం నాడు వాటి రేట్లల్లో భారీ పెరుగుదల కనిపించింది. వేర్వేరు నగరాల్లో వేర్వేరు స్థాయిల్లో వాటి ధరల్లో పెరుగుదల నెలకొంది. బంగారం ధర తొమ్మిది నెలలుగా గరిష్ఠ స్థాయి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. 10 వేల రూపాయల వరకు తగ్గుదలను నమోదు చేసుకుంది. బంగారం కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదనే అభిప్రాయాన్ని కలిగింది. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. పసిడి ధరల్లో పెరుగుదల నెలకొంది.

అంతర్జాతీయ స్థాయిలో కొద్దిరోజులుగా బులియన్ మార్కట్ బలహీన పడుతోంది. బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం నాటితో దీనికి బ్రేక్ పడింది. రెండు రోజులుగా మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు స్వల్పంగా పుంజుకొన్నాయి. బంగారం ఫ్యూచర్ ట్రేడ్‌లో 30 రూపాయల మేర నామమాత్రపు తగ్గుదల నెలకొంది. 47,625 రూపాయల వద్ద నిలిచింది. వెండి ఫ్యూచర్ ట్రేడ్ 123 రూపాయల క్షీణతతో కేజీ ఒక్కింటికి 71,558 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనుకూల పరిస్థితుల వల్ల శనివారం వాటి ట్రేడింగ్‌లో పెరుగుదల చోటు చేసుకుంది.

Gold rate today surges in Hyderabad, Bangalore and Visakhapatnam on 8 May 2021

అమెరికాలో బంగారం లావాదేవీలు 5.75 డాలర్ల మేర పెరిగింది. ఒక ఔన్స్‌ పసిడి విలువ 1,820.69 వద్ద నిలిచింది. వెండి 0.06 డాలర్ల మేర తగ్గుదలతో 27.36 డాలర్లు పలుకుతోంది. శనివారం ఉదయం వేర్వేరు నగరాల్లో రికార్డయిన బంగారం, వెండి ధరల ప్రకారం.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 45,910 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 49,950 రూపాయలుగా పలికింది. వెండి కిలో ఒక్కింటికి 71,600 వద్ద నిలిచింది. బెంగళూరులో 22 క్యారెట్లు-44,500, 24 క్యారెట్లు-48,550, వెండి-76,100గా రికార్డయింది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 44,970, 24 క్యారెట్లు-49,060 వద్ద నిలవగా.. వెండి 71,600లు పలికింది. కోల్‌కతలో 22 క్యారెట్ల బంగారం-46,850, 24 క్యారెట్లు-49,640, వెండి 71,600లుగా రికార్డయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 22 క్యారెట్లకు 44,500 రూపాయలు, 24 క్యారెట్లు-48,550 రూపాయలుగా నమోదైంది. వెండి కేజీ ఒక్కింటికి 76,100 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలల్లో ఇదే రేటు కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం-44,800, 24 క్యారెట్లు 45,800 రూపాయలుగా పలకగా.. వెండి 71,600 రూపాయల వద్ద నిలిచింది.

English summary

రూ.50 వేలకు టచ్: బంగారం కొనాలనుకుంటున్నారా? ఆలోచించాల్సిందే! | Gold rate today surges in Hyderabad, Bangalore and Visakhapatnam on 8 May 2021

The gold rates have seen a surge at all major cities across the country on Saturday. On MCX, the gold rate is at Rs. 48,550 with a hike of Rs 550. The yellow metal prices have remained choppy in the last week.
Story first published: Saturday, May 8, 2021, 10:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X