For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!

|

ముంబై: దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు నేడు (మంగళవారం, జనవరి 19) స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం అతి స్వల్పంగా పెరిగాయి. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ నిన్న 0.36% పెరిగి రూ.48,877.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.47% పెరిగి రూ.48,946.00 వద్ద ముగిసింది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 0.96% పెరిగి రూ.65,385.00 వద్ద, మే ఫ్యూచర్స్ 0.98% పెరిగి రూ.66,259.00 వద్ద క్లోజ్ అయింది. కానీ నేడు అతి స్వల్పంగా తగ్గాయి.

వేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువవేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువ

రూ.48,900కు దిగువన పసిడి

రూ.48,900కు దిగువన పసిడి

నేడు సాయంత్రం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 51.00 (-0.10%) తగ్గి రూ.48,843.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,965.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,070.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,750.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 44.00 (-0.09%) తగ్గి రూ.48,908.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,921.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,160.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,811.00 వద్ద కనిష్టాన్ని తాకింది. వ్యాక్సినేషన్ నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గి బంగారం ధరలను నిలిపివేసింది.

వెండి స్వల్ప పెరుగుదల

వెండి స్వల్ప పెరుగుదల

బంగారం ధరలు తగ్గగా, వెండి ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 231.00 (0.35%) పెరిగి రూ.65660.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,829.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,195.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,370.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.273.00 (0.41%) పెరిగి రూ.66530.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,675.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,024.00 వద్ద గరిష్టాన్ని, రూ.66301.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1840 డాలర్లకు దిగువనే

1840 డాలర్లకు దిగువనే

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగినప్పటికీ 1840 డాలర్లకు దిగువనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 4.65 (+0.25%) డాలర్లు పెరిగి 1,834.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే ఉదయం పెరుగుదలతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. నేటి సెషన్లో 1,831.95 - 1,844.50 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 18.35% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.282 (+1.13%) డాలర్లు తగ్గి 25.148 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.992 - 25.475 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 40.31శాతం పెరిగింది. సిల్వర్ కూడా ఉదయంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.

English summary

Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్! | Gold rate slips as vaccine deployment drags price

Gold futures prices in the domestic market continued its downward journey in the morning trade for another day on Tuesday bucking the trend in the international market, but the losses were limited as India sped up vaccine deployment.
Story first published: Tuesday, January 19, 2021, 22:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X