For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.48,800 దిగువకు వచ్చిన బంగారం ధర, వెండి రూ.65,000కు పైనే

|

బంగారం ధరలు 1850 డాలర్ల దిగువకు వచ్చాయి. గతవారం అంతకంతకు ఎగిసి 1900 డాలర్ల దిశగా కనిపించిన పసిడి ధరలు రెండుమూడు సెషన్లుగా కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,000 దిగువకు వచ్చాయి. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి(నవంబర్ 22, సోమవారం) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా రూ.26.00 (-0.05%) తగ్గి రూ.48802.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.89.00 (-0.18%) తగ్గి రూ.49012.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 6.80 (-0.37%) డాలర్లు క్షీణించి 1,844.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,839.90 - 1,850.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. 52 వారాల గరిష్టం 1971.50 డాలర్లు, 52 వారాల కనిష్టం 1677.90 డాలర్లు. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1851 డాలర్లకు పైన క్లోజ్ అయింది.

Gold prices today: Yellow metal falls below Rs 48,800

సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు స్థిరంగా 0.007 (+0.03%) డాలర్లు పెరిగి 24.788 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.555 - 24.788 డాలర్ల మధ్య కదలాడింది. 52 వారాల గరిష్టం 29.930 డాలర్లు, 52 వారాల కనిష్టం 21.410 డాలర్లు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ రూ.66,000 డాలర్లకు దిగువనే ఉంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.177.00 (0.27%) పెరిగి రూ.65733.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.179.00 (0.27%) లాభపడి రూ.66802.00 వద్ద ట్రేడ్ అయింది.

English summary

రూ.48,800 దిగువకు వచ్చిన బంగారం ధర, వెండి రూ.65,000కు పైనే | Gold prices today: Yellow metal falls below Rs 48,800

Gold and silver futures prices were trading flat with negative bias on Monday as commentary from central banks suggests there could be a rate hike earlier than expected, which will be detrimental to bullion counters.
Story first published: Monday, November 22, 2021, 13:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X