For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్ సంతకం ఎఫెక్ట్, భారీగా పెరిగిన బంగారం ధరలు, వెండి రూ.2,000 జంప్

|

బంగారం ధరలు ఈ వారం భారీ పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గతవారం 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50064.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.50198.00 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు (సోమవారం 28) ప్రారంభ సెషన్‌లోనే దాదాపు రూ.450 వరకు ఎగిసింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ప్యాకేజీపై సంతకం చేసిన నేపథ్యంలో పసిడి ధరలపై ఒత్తిడి పెరిగింది. దీంతో అంతర్జాతీయ, జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు కాస్త పెరిగాయి.

WHO COVID-19 Updates: అన్ని వివరాలతో సరికొత్త యాప్WHO COVID-19 Updates: అన్ని వివరాలతో సరికొత్త యాప్

బంగారం రూ.430 జంప్

బంగారం రూ.430 జంప్

బంగారం ధరలు నేడు ప్రారంభ సెషన్లో నేడు రూ.433.00 (0.86%) పెరిగి రూ.50506.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,530.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,200.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.421.00 (0.84%) పెరిగి రూ.50550.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,500.00 వద్ద ప్రారంభమై, రూ.50,550.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,471.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ రూ.2000

సిల్వర్ రూ.2000

వెండి ఏకంగా రూ.2000 పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.2,028.00 (3.00%) ఎగిసి రూ.69537.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,000.00 వద్ద ప్రారంభమై, రూ.69,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గత వారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది. ఇప్పుడు రూ.69వేలు దాటి రూ.70వేల దిశగా సాగుతోంది. మార్చి ఫ్యూచర్స్ (మే) రూ.2,004.00 (2.93%) పెరిగి రూ.70326.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,413.00 వద్ద ప్రారంభమై, రూ.70,543.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,326.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడ 1900 డాలర్ల దిశగా...

అక్కడ 1900 డాలర్ల దిశగా...

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా సాగుతోంది. ఈ సమయంలో ఈ స్థాయిని కూడా దాటింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 15.85 (+0.84%) డాలర్లు పెరిగి 1,899.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,885.80 - 1,904.05 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 22.93 శాతం పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.927 (+3.58%) డాలర్లు పెరిగి 26.835 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.085 - 26.973 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 47.65% పెరిగింది.

English summary

ట్రంప్ సంతకం ఎఫెక్ట్, భారీగా పెరిగిన బంగారం ధరలు, వెండి రూ.2,000 జంప్ | Gold Prices Today: Yellow gains 1 percent as Trump signs stimulus bill

Gold prices jumped 1% on Monday as the metal's appeal as an inflation hedge was boosted by news that U.S. President Donald Trump had signed a long-awaited coronavirus relief aid bill.
Story first published: Monday, December 28, 2020, 10:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X