బంగారం, వెండి ధరలు నేడు (జూన్ 9) అతి స్వల్పంగా తగ్గాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు ఫ్లాట్‌గా ఉన్నాయి. అమెరికా ద్రవ్యోల్భణం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు పాలసీ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిగువనే ట్రేడ్ అవుతోంది.
ఈ వారంలో పెరుగుదల కనిపించినప్పటికీ 1912 నుండి 1918 డాలర్ల మధ్య నిరోదకస్థాయి ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా బెంచ్ మార్క్ టెన్ ఇయర్ ట్రెజరీ యీల్డ్స్ 1.53 శాతం తగ్గిన ప్రభావం బులియన్ మార్కెట్ పైన ఉంటుంది. బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 తక్కువగా ఉంది.

అతి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.60.00 (0.12%) తగ్గి రూ.49067.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,150.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,198.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.49,024.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45.00 (0.09%) తగ్గి రూ.49370.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,473.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,505.00 గరిష్టాన్ని, రూ.49,350.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండిదీ అదే దారి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.76.00 (-0.11%) తగ్గి రూ.71155.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,356.00 వద్ద ప్రారంభమై, రూ.71,415.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,057.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.51.00 (0.07%) తగ్గి రూ.72380.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,560.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,600.00 గరిష్టాన్ని, రూ.72,273.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 1895 డాలర్ల దిగువన ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 2.55 (0.13%) డాలర్లు తగ్గి 1,891.85 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,889.35 - 1,898.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.033 (0.12%) డాలర్లు తగ్గి 27.695 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.625 - 27.850 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications