ముంబై: కరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు ఈ ఏడాది భారీగా పెరిగాయి. ఓ సమయంలో 40 శాతం వరకు పెరిగాయి. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సీన్ సానుకూల ప్రకటనల నేపథ్యంలో ధరలు అదేస్థాయిలో పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఓ సమయంలో ఔన్స్ 2,072 పలికిన ధర ఇప్పుడు 1800 డాలర్ల దిగువకు వచ్చింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 ఉండగా, ఇప్పుడు రూ.48,000 స్థాయికి వచ్చింది. గత నాలుగేళ్లలో ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి.

300 డాలర్లకు పైగా తగ్గిన పసిడి
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు ఈ రోజు మరింతగా క్షీణించాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 8.95 (-0.50%) డాలర్లు క్షీణించి 1,779.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,767.40 - 1,792.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1788 వద్ద ముగిసింది. ఏడాదిలో పసిడి 20 శాతం వరకు పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం (2072) నుండి బంగారం ధర ఏకంగా 300 డాలర్లకు పైగా తగ్గింది. మన కరెన్సీలో రూ.23వేలకు పైగా తగ్గింది. గత నాలుగేళ్లలో ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. మన వద్ద రూ.8వేలు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధర కూడా 22 డాలర్ల స్థాయికి వచ్చింది. ఔన్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.364 (-1.61%) డాలర్లు క్షీణించి 22.275 వద్ద ట్రేడ్ అయింది. 21.962 - 22.785 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 22.639 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 30 శాతానికి పైగా పెరిగింది.

ఒక నెలలో భారీ క్షీణత
వ్యాక్సీన్ పైన సానుకూల ప్రకటనల నేపథ్యంలో నవంబర్ నెలలో పసిడి ధరలు 6 శాతం తగ్గాయి. 2016 నవంబర్ తర్వాత ఇదే భారీ క్షీణత. వెండి ధర 3.2 శాతం క్షీణించింది. నేడు ప్లాటినమ్ 0.9 శాతం క్షీణించి 954.64 డాలర్లు, పల్లాడియం 0.4 శాతం క్షీణించి 2,416.22 డాలర్లు పలికింది.

నేడు ఎంసీఎక్స్ క్లోజ్
ఈ రోజు (నవంబర్ 30) గురునానక్ జయంతి. కాబట్టి ఈక్విటీ మార్కెట్లకు, కమోడిటీస్ మార్కెట్లకు సెలవుదినం. నేడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లోజ్ అవుతాయి. అయితే సాయంత్రం 5 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.48,106 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.రూ.48,114 వద్ద క్లోజ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ కిలో రూ.59,100 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.60,333 వద్ద ముగిసింది.
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!



Click it and Unblock the Notifications