For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.51,000 సమీపంలో... రూ.1,200 తగ్గిన బంగారం ధర: వెండి ధర ఎంత ఉందంటే?

|

బంగారం ధరలు గతవారం చివరలో ఎగిశాయి. ధనతెరాస్, దీపావళి సందర్భంగా స్వల్పంగా పెరిగాయి. దీపావళి ప్రత్యేక గంటపాటు జరిగే ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.25 శాతం ఎగిసి రూ.51,050ను తాకింది. వెండి ధర కిలో 0.32 శాతం లాభపడి 63,940 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి ధరలు ఇప్పటికీ రూ.5300 తక్కువగా ఉంది.

ధనతెరాస్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే: గోల్డ్ కాయిన్స్, చిన్న ఆభరణాల కొనుగోళ్లు జిగేల్ధనతెరాస్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే: గోల్డ్ కాయిన్స్, చిన్న ఆభరణాల కొనుగోళ్లు జిగేల్

గతవారం మొత్తంగా భారీగా తగ్గుదల

గతవారం మొత్తంగా భారీగా తగ్గుదల

గత వారంలో మొత్తంగా పసిడి ధర తగ్గింది. వారం ప్రారంభంలో భారీగా తగ్గగా, చివరలో పెరుగుదలను నమోదు చేసింది. సోమవారం నుండి శుక్రవారం వరకు జరిగిన ఐదు సెషన్‌లలో మొత్తంగా రూ.1200 తగ్గింది. ఫైజర్ వ్యాక్సీన్ 90 శాతం ఫలితాలు సాధించినట్లు ప్రకటించడంతో ఒకేరోజు రూ.2500 వరకు పడిపోయింది. ఆ తర్వాత సెషన్‌లలో వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయల మధ్య పెరిగింది.

10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం రూ.50,922 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో రూ.51,080.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,862.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.51045.00 వద్ద క్లోజ్ అయింది. రూ.51,158.00 గరిష్టాన్ని, రూ.50,975.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర ఎంత ఉందంటే

వెండి ధర ఎంత ఉందంటే

వెండి ధర క్రితం సెషన్‌లో కిలో రూ.125.00 తగ్గి రూ.63,608.00 (డిసెంబర్ ఫ్యూచర్స్) వద్ద క్లోజ్ అయింది. 64,038.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,560.00 కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ రూ.178 తగ్గి రూ.65,396 వద్ద ముగిసింది. రూ.65,747.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,359.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, సిల్వర్ ధరలు క్రితం సెషన్లో పెరిగాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.80 శాతం ఎగిసి 1,888.35 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 25.97% పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 1.89 శాతం పెరిగి 24.765 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 43.55% పెరిగింది.

English summary

రూ.51,000 సమీపంలో... రూ.1,200 తగ్గిన బంగారం ధర: వెండి ధర ఎంత ఉందంటే? | Gold prices today rise, cross Rs 51,000, silver jumps

Gold and silver prices edged higher in Indian markets on Diwali. In the special one-hour Muhurat trading session on MCX, gold futures rose 0.25% to ₹51,050 per 10 gram while silver rates rose 0.32% to ₹63940 per kg.
Story first published: Sunday, November 15, 2020, 21:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X