For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు రోజుల్లో రూ.1300 పెరిగిన బంగారం, నిన్న రూ.3,000 పెరిగిన వెండి నేడు డౌన్

|

వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న రూ.700 వరకు పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్, ఈ రోజు దాదాపు రూ.600 వరకు ఎగిసింది. నిన్న రూ.694 పెరిగిన డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్ సమయానికి రూ.574 పెరిగింది. అంటే రెండు రోజుల్లో దాదాపు రూ.1300 పెరిగింది. ఇటీవల రూ.48వేల దిగువకు వెళ్లిన పసిడి, ఇప్పుడు రూ.49వేలకు సమీపంలో ఉంది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7,300కు పైగా తక్కువ ఉంది. గత రెండు రోజుల్లో రూ.8500 వరకు కూడా తక్కువకు చేరింది. ఇప్పుడు మళ్లీ ఎగిసింది. ఇక వెండి ధర నిన్న రూ.3వేల వరకు పెరిగి, నేడు అతిస్వల్పంగా రూ.175 తగ్గింది.

SBI యోనో యాప్‌లో ఎర్రర్, కస్టమర్ల తీవ్ర అసహనం: ట్విట్టర్‌లో వెల్లువ..SBI యోనో యాప్‌లో ఎర్రర్, కస్టమర్ల తీవ్ర అసహనం: ట్విట్టర్‌లో వెల్లువ..

రూ.1300 పెరిగిన బంగారం

రూ.1300 పెరిగిన బంగారం

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ పసిడి ధరలు రూ.574.00 (1.19%) పెరిగి రూ.48,849.00 పలికింది. రూ.48,499.00 ప్రారంభమై, రూ.48,849.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,400.00 వద్ద కనిష్టాన్ని తాకింది. రెండు రోజుల్లో పసిడి రూ.1300 పెరిగింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.368.00 (0.76%) పెరిగి రూ.48935.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,459.00 ప్రారంభమై, రూ.49,112.00 గరిష్టాన్ని, రూ.48,354.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి దాదాపు స్థిరం

వెండి దాదాపు స్థిరం

డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.175.00 (-0.28%) క్షీణించి రూ.61743.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,628.00 ప్రారంభమైన ధర, రూ.63,040.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,425.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

డిసెంబర్ సిల్వర్ క్షీణించగా, మార్చి సిల్వర్ ధర పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా రూ.52.00 (0.08%) ఎగిసి రూ.63250.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,481.00 ప్రారంభం కాగా, రూ.64,300.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,355.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1820 డాలర్ల పైకి చేరుకున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 11.65 (+0.64%) డాలర్లు పెరిగి 1,830.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 1,810.55 - 1,834.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1819 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో22 శాతం పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ 0.025 (-0.10%) క్షీణించి 24.065 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి ట్రేడింగ్‌లో 23.683 - 24.450 డాలర్ల మధ్య కనిపించింది. క్రితం సెషన్లో 24.090 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 40 శాతం పెరిగింది.

English summary

రెండు రోజుల్లో రూ.1300 పెరిగిన బంగారం, నిన్న రూ.3,000 పెరిగిన వెండి నేడు డౌన్ | Gold prices today rise, after big fall: silver rates drop

Gold had jumped ₹700 per 10 gram while silver about ₹3000 per kg in the previous session.The rates of gold have fallen about ₹7300 from August highs.
Story first published: Wednesday, December 2, 2020, 22:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X