For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: స్థిరంగా బంగారం ధరలు, రూ.45,000 దిగువనే

|

బంగారం, వెండి ధరలు నేడు (మార్చి 16, మంగళవారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. గతవారం క్షీణించిన పసిడి ధరలు, ఈ వారం నిన్న, నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ, అది అతి కొద్దిగా మాత్రమే. అయినప్పటికీ పసిడి ధరలు రూ.45,000కు దిగువనే ఉన్నాయి. ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్ ధరలు నిన్న రూ.160.00 (0.36%) పెరిగి రూ.44910.00 వద్ద, జూన్ ఫ్యూచర్ రూ.203.00 (0.45%) పెరిగి రూ.45310.00 వద్ద ముగిసింది. సిల్వర్ మే ఫ్యూచర్ రూ.840.00 (1.26%) పెరిగి రూ.67684.00 వద్ద, జూలై ఫ్యూచర్ రూ.869.00 (1.28%) ఎగిసి రూ.68741.00 వద్ద ముగిసింది.

బంగారం స్వల్పంగా పెరుగుదల

బంగారం స్వల్పంగా పెరుగుదల

గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.59.00 (0.13%) పెరిగి రూ.44959.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,950.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,979.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,922.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,200 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.24.00 (0.05%) పెరిగి రూ.45321.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,348.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,348.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,305.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు అతి స్వల్పంగా డౌన్

వెండి ధరలు అతి స్వల్పంగా డౌన్

వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.108.00 (-0.16%) పెరిగి రూ.67561.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,572.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,617.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,478.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కిలో రూ.71.00 (0.10%) పెరిగి రూ.68741.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 1730 డాలర్ల పైనే ఉంది. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 3.05 (+0.18%) డాలర్లు తగ్గి 1,732.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,727.65 - 1,732.30

డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైనే ఉంది. ఔన్స్ ధర +0.027 (+0.10%) డాలర్లు పెరిగి 26.313 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.195 - 26.380 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold prices today: స్థిరంగా బంగారం ధరలు, రూ.45,000 దిగువనే | Gold prices today remain weak, down over ₹11000 from record high, silver dips

Gold and silver prices struggled in Indian markets amid weak global cues. On MCX, gold futures were flat at ₹44,930 per 10 gram while silver dipped 0.2% to ₹67,510 per kg. In the previous session, gold had edged 0.35% higher while silver rose 1.3%. In global markets, gold prices were flat today at $1,732.32 per ounce ahead of the the outcome of outcome of a U.S. Federal Reserve policy meeting.
Story first published: Tuesday, March 16, 2021, 10:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X