For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో! భారీగా పెరిగిన బంగారం ధరలు: పసిడి రూ.1200 జంప్, వెండి ఏకంగా రూ.2,600

|

దీపావళి పండుగకు ముందు బంగారం ధర భారీ షాకిచ్చింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఏకంగా రూ.1,200కుపైగా పెరిగి, చాలా రోజుల అనంతరం రూ.52,000 మార్క్‌ను దాటింది. నిన్న రూ.800కుపైగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట ఇచ్చింది. కానీ అంతలోనే తగ్గుదలకు మించి పెరిగింది. గురువారం (నవంబర్ 5) సాయంత్రం గం.9.40 సమయానికి ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,220.00 (2.40%) పెరిగి రూ.52,040.00 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టంతో (రూ.56,200) చాలా రోజులకు రూ.4,100 తక్కువకు పడిపోయింది. నిన్నటి వరకు రూ.5000కు పైగా తక్కువగా ఉంది.

జోబిడెన్ ఎఫెక్ట్! 4 రోజులు.. రూ.4 లక్షల కోట్ల లాభం!!జోబిడెన్ ఎఫెక్ట్! 4 రోజులు.. రూ.4 లక్షల కోట్ల లాభం!!

ఫ్యూచర్ గోల్డ్ రూ.1200కు పైగా జంప్

ఫ్యూచర్ గోల్డ్ రూ.1200కు పైగా జంప్

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,231.00 ప్రారంభమై, రూ.52,133.00 గరిష్టాన్ని, రూ.51,161.00 కనిష్టాన్ని తాకింది. వార్త రాసే సమయానికి రూ.1220 పెరిగింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ కూడా అదే స్థాయిలో పెరిగింది. రూ.51,404.00 ప్రారంభమై, రూ.52,270.00 గరిష్టాన్ని తాకి, రూ.51,318.00 కనిష్టాన్ని తాకింది. రూ.1,223.00 (2.40%) పెరిగి రూ.52,200 వద్ద ట్రేడ్ అయింది.

వెండి రూ.2500 జంప్

వెండి రూ.2500 జంప్

సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగానే పెరిగింది. కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.2,584.00 (4.21%) పెరిగి రూ.63,973 వద్ద ట్రేడ్ అయింది. 62,020.00 ప్రారంభమైన ధర, రూ.64,180.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,900.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ రూ.2,665.00 (4.23%) పెరిగి రూ.65,713.00 పలికింది. రూ.63,636.00 వద్ద ప్రారంభమై, రూ.65,911.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,636.00 కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ హై ధరతో నిన్నటి వరకు రూ.18వేలకు పైగా తక్కువగా ఉండగా, నేటి పెరుగుదలతో రూ.15వేలకు పడిపోయింది.

వామ్మో.. పసిడి, వెండి

వామ్మో.. పసిడి, వెండి

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు భారీగానే పెరిగాయి. నేడు ఒక్కరోజే ఔన్స్ పసిడి 3 శాతం లేదా 56.85 డాలర్లు పెరిగి 1,953 డాలర్లు పలికింది. ఈ రోజు 1,902.55 - 1,953.75 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1896 వద్ద ముగిసింది. ఈ ఏడాది పసిడి 26 శాతానికి పైగా పెరిగింది.

ఔన్స్ వెండి కూడా 5.40 శాతం లేదా 1.287 డాలర్లు పెరిగి 25 డాలర్లను క్రాస్ చేసింది. 23.957 - 25.223 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 23.893 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో పసిడి 35 శాతం పెరిగింది. కాగా, వెండి 25 డాలర్ల మార్క్, పసిడి 1950 డాలర్ల మార్క్ చాలా రోజుల తర్వాత దాటాయి.

English summary

వామ్మో! భారీగా పెరిగిన బంగారం ధరలు: పసిడి రూ.1200 జంప్, వెండి ఏకంగా రూ.2,600 | Gold prices today: gold futures jump by over Rs 1200 to reclaim ₹ 52,000 mark as dollar eases

Multi Commodity Exchange gold futures - due for a December 4 expiry - gained by ₹ 1200 - or 2.40 percent - to settle at ₹ 52,000 for the day.
Story first published: Thursday, November 5, 2020, 22:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X