For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు, వెండిదీ అదే దారి

|

బంగారం ధరలు ఈ వారంలో వరుసగా మూడో రోజు క్షీణించాయి. ఆగస్ట్ 7 రూ.56,200 గరిష్ట ధరతో రూ.5,700 వరకు తక్కువగా ఉంది. గతవారం ఫైజర్ వ్యాక్సీన్ ప్రకటన నేపథ్యంలో పది గ్రాముల పసిడి రూ.1200 తగ్గింది. ఇటీవల మోడర్నా టీకా కూడా సానుకూల ప్రకటన చేసింది. వరుస వ్యాక్సీన్ ప్రకటనల నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గుతోంది. బుధవారం (నవంబర్ 18) ప్రారంభ సెషన్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ -295.00 (-0.58%) క్షీణించి రూ.50,471.00 పలికింది. రూ.50,600.00 ప్రారంభం కాగా, రూ.50,646.00 గరిష్టాన్ని, రూ.50,464.00 కనిష్టాన్ని పలికింది.

రూ.300 తగ్గుదల

రూ.300 తగ్గుదల

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.300 వరకు పెరగగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.298.00 (-0.59%) పెరిగి రూ.50,526.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,667.00వద్ద ప్రారంభం కాగా, రూ.50,696.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,526.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది పసిడి ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. మార్చి నెలలో రూ.40వేల దిగువన పలికిన పసిడి ఇప్పుడు రూ.50వేల పైన ఉంది. రెండు నెలలుగా రూ.49,500 నుండి రూ.52,000 దిగువన ట్రేడ్ అవుతోంది.

నిన్న డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 56.00 (-0.11%) తగ్గి రూ.50774.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.100.00 (-0.20%) తగ్గి రూ.50806.00 వద్ద క్లోజ్ అయింది.

వెండి ఎంత తగ్గిందంటే

వెండి ఎంత తగ్గిందంటే

వెండి ధర రూ.300కు పైగా తగ్గింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.359.00 (0.57%) క్షీణించి రూ.62,889.00 వద్ద ట్రేడ్ అయింది. తద్వారా ఫ్యూచర్ సిల్వర్ రూ.63,000 దిగువకు వచ్చింది. రూ.62,897.00 ప్రారంభమై, రూ.63,029.00 గరిష్టాన్ని, రూ.62,808.00 కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ రూ.363.00 (-0.56%) తగ్గి రూ.64,730.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,717.00 వద్ద ప్రారంభమై, రూ.64,845.00 గరిష్టాన్ని, రూ.64,675.00 కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.393.00 (-0.62%) క్షీణించి రూ.63298.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.312.00 (-0.48%) తగ్గి రూ.65177.00 వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 7.95 (-0.42%) క్షీణించి 1,877.05 డాలర్లు పలికింది. క్రితం సెషన్లో 1,885.10 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో బంగారం 25 శాతం మేర పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ 0.151 (-0.61%) తగ్గి 24.503 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.651 డాలర్ల వద్ద ముగిసింది. ఏఢాదిలో 41 శాతానికి పైగా పెరిగింది.

English summary

Gold prices today: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు, వెండిదీ అదే దారి | Gold prices today fall for third day in a row, silver rates drop

Gold and silver prices in India edged lower today, tracking muted global cues. On MCX, gold futures today fell 0.43% to ₹50,546 per 10 gram, extending losses to the third day.
Story first published: Wednesday, November 18, 2020, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X