For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

|

బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ గెలుపు, ప్రమాణ స్వీకారం, అగ్రరాజ్యం ఆర్థిక ప్యాకేజీ, కరోనా కేసులు, వ్యాక్సినైజేషన్, ఈక్విటీ మార్కెట్, డాలర్ వ్యాల్యూ వంటి అంశాలు బులియన్ మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి. దీంతో గత కొద్ది వారాలుగా ఒత్తిడిలో ఉంటున్న సురక్షిత పెట్టుబడిగా భావించే ఈ లోహం రూ.50,000కు అటు ఇటుగా కదలాడుతోంది. ఇటీవలే రూ.50,000 దిగువకు వచ్చిన బంగారం, ఇప్పుడు రూ.49,000కు కాస్త పైన ఉంది.

PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరుPNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు

బంగారం ధరలు స్థిరంగా..

బంగారం ధరలు స్థిరంగా..

నేడు సాయంత్రం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 35.00 (-0.17%) క్షీణించి రూ.49,105.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,155.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,346.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,925.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7200 వరకు తక్కువగా ఉంది. బంగారం ధరలు కొద్ది రోజులుగా రూ.50వేల సమీపంలో కదలాడుతున్నాయి.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 4.00 (-0.01%) తగ్గి రూ.49,294.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,294.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,530.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,106.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్పంగా డౌన్

వెండి స్వల్పంగా డౌన్

బంగారం ధరలు తగ్గగా, వెండి ఫ్యూచర్స్ కూడా అదే దారిలో నడిచింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 303.00 (0.45%) తగ్గి రూ.66339.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,896.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,214.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,909.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ 351.00 (0.52%) తగ్గి రూ.67198.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,611.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,071.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,988.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్లకు చేరువలో పసిడి

1850 డాలర్లకు చేరువలో పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర క్షీణించి 1860 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1.45 (-0.08%) డాలర్లు తగ్గి 1,854.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,846.30 - 1,867.35 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 16.05% శాతం పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్‌తో సిల్వర్ ఫ్యూచర్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.114 (-0.45%) డాలర్లు పెరిగి 25.442 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.205 - 25.835 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 40.43శాతం పెరిగింది.

English summary

రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే | Gold prices today fall by Rs 35 to Rs 49,105

Gold prices in India continued to be weak for the third day in a row. On MCX, gold futures dipped 0.017% to ₹49,105 per 10 gram despite positive global cues
Story first published: Monday, January 25, 2021, 22:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X