For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి: ఆల్‌టైం గరిష్టంతో రూ.7,000 తక్కువ

|

బంగారం ధరలు నేడు (గురువారం డిసెంబర్ 10) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మూడువారాలు భారీగా క్షీణించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో పది గ్రాములు రూ.48,000 దిగువకు పడిపోయింది. అయితే గత వారం ప్రారంభం నుండి మొన్నటి వరకు ఎగిసింది. తాజాగా కరోనా కేసులు తగ్గడం, ఫైజర్ వ్యాక్సీన్‌కు అమెరికా అనుమతి, రికవరీలు పెరగడం, ఈక్విటీ మార్కెట్ జోరు వంటి వివిధ కారణలతో పసిడిపై ఒత్తిడి తగ్గింది. దీంతో 2 రోజుల్లో పసిడి ధరలు రూ.1,000 వరకు తగ్గింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.49వేల పైన ఉంది.

ఆల్ టైం గరిష్టంతో రూ.7000 డౌన్

ఆల్ టైం గరిష్టంతో రూ.7000 డౌన్

ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.116.00 (-0.24%) క్షీణించి రూ.49144.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,165.00 వద్ద ప్రారంభమై, రూ.49,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,935.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7,000కు పైగా తక్కువ ఉంది. రెండు రోజుల్లో రూ.1000కి పైగా తగ్గింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.-83.00 (-0.17%) క్షీణించి రూ.49260.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,350.00 వద్ద ప్రారంభమై, రూ.49,571.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,048.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.63,600కు పైన వెండి ధర

రూ.63,600కు పైన వెండి ధర

వెండి ధర స్వల్పంగా పెరిగింది. మార్చి ఫ్యూచర్స్ రూ.130.00 (0.20%) పెరిగి 63629.00వద్ద ట్రేడ్ అయింది. రూ.63,747.00 వద్ద ప్రారంభమై, రూ.64,399.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,931.00 కనిష్టాన్ని తాకింది.

మే ఫ్యూచర్స్ రూ.23.00 (0.04%) పెరిగి రూ.64425.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,430.00 వద్దప్రారంభమై, రూ.65,024.00 గరిష్టాన్ని, రూ.63,845.00 కనిష్టాన్ని తాకింది.

అక్కడ రెండూ జంప్

అక్కడ రెండూ జంప్

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి పెరిగింది. ఔన్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.35 (+0.02%) పెరిగి 1,838.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,832.00 - 1,853.75 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 23.27% పెరిగింది.

వెండి ఫ్యూచర్స్ +0.127 (+0.53%) డాలర్లు పెరిగి 24.117 డాలర్లు పలికింది. 23.825 - 24.427 డాలర్ల మధ్య కదలదాడింది. ఏడాదిలో 42.38% పెరిగింది.

English summary

తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి: ఆల్‌టైం గరిష్టంతో రూ.7,000 తక్కువ | Gold prices slide to Rs 49,191 on increased risk appetite

Gold prices dropped by 498 to Rs 49,191 per 10 gram in the Mumbai retail market on increasing risk appetite amid COVID-19 vaccine optimism.
Story first published: Thursday, December 10, 2020, 22:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X