For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండ్రోజుల్లో రూ.1,200 తగ్గిన బంగారం ధర, ఈ ఏడాది పెరుగుతుందా?

|

బంగారం ధరలు దిగి వస్తున్నాయి. వరుసగా మూడో రోజు.. బుధవారం పసిడి ధరం తగ్గింది. ఈ రోజు ఉదయం రూ.396 తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.41వేల మార్క్‌కు దిగువకు చేరుకొని రూ.40,871 వద్ద ఉంది. తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గుముఖం పట్టింది. వెండి కూడా కిలో రూ.179 తగ్గి రూ.46,881 వద్ద ఉంది.

ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు 0.5 శాతం తగ్గి రూ.40,188 వద్ద ఉంది. రెండు రోజుల్లో రూ.1200 తగ్గింది. వెండి ధర కిలోకు 0.6 శాతం తగ్గి రూ.45,823 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 1,555.41 డాలర్ల వద్ద ఉంది. అంతకుముందు సెషన్లో 1.5 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా బంగారం ధరలు ఈ ఏడాదిలో 2,000 డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.

HUDCO నుంచి రూ.5,000 కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం, ఎందుకో తెలుసా?HUDCO నుంచి రూ.5,000 కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం, ఎందుకో తెలుసా?

Gold prices rise today after falling Rs 1,200 per 10 gram in just two days

బుధవారం వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి... చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.38,480, 24 క్యారెట్ల బంగారం రూ.41,980, 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం వరుసగా... ముంబైలో రూ.39,450, రూ.40,450, న్యూఢిల్లీలో రూ.39,300, రూ.40,500, కోల్‌కతాలో రూ.39,720, రూ.41,120, బెంగళూరులో రూ.37,750, రూ.41,180, హైదరాబాదులో రూ.38,480, రూ.41,980, విజయవాడలో రూ.38,480, రూ.41,980, విశాఖలో రూ.38,480, రూ.41,980గా ఉంది.

English summary

రెండ్రోజుల్లో రూ.1,200 తగ్గిన బంగారం ధర, ఈ ఏడాది పెరుగుతుందా? | Gold prices rise today after falling Rs 1,200 per 10 gram in just two days

Gold prices edged higher today after seeing a sharp fall in the previous two sessions. On MCX, gold prices moved 0.5% higher to ₹40,188 per 10 gram. In previous two sessions, gold prices had fallen about ₹1200 per 10 gram.
Story first published: Wednesday, February 5, 2020, 17:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X