For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: బంగారం ధరలు అలాగే, అక్కడ 1900 డాలర్లకు పైన..

|

దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. అయితే అతి స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. గత ఏడాది (2020) బంగారం ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్ అందించింది. పసిడి దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో గత ఏడాదిలో ఇరవై ఏడు శాతం వరకు రిటర్న్స్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో 2020లో పసిడి 25 శాతం లాభపడింది. గత ఏడాది దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి రూ.50,000 పైన, అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్ల సమీపంలో క్లోజ్ అయింది. నేడు స్వల్పంగా పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ కామెక్స్‌లో 1900 డాలర్లు క్రాస్ చేసింది.

<strong>వాహనదారులకు గుడ్‌న్యూస్, FASTag గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు</strong>వాహనదారులకు గుడ్‌న్యూస్, FASTag గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు

స్వల్పంగా పెరిగిన బంగారం

స్వల్పంగా పెరిగిన బంగారం

నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.84.00 (0.17%) పెరిగి రూ.50,235.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,180.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,280.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,128.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.6000 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.-136.00 (-0.17%) పెరిగి రూ.50,319.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,250.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,319.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,222.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి అతి స్వల్పంగా

వెండి అతి స్వల్పంగా

కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి అతిస్వల్పంగా 15.00 (0.02%) పెరిగి రూ.68120.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,254.00 వద్ద ప్రారంభమై, రూ.68,275.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,860.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గతవారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా క్షీణించింది. రూ.18.00 (-0.03%) క్షీణించి రూ.69050.00 వద్ద ట్రేడ్ అయింది.

రూ.69,163.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,163.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,868.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో 1900 క్రాస్

అంతర్జాతీయ మార్కెట్లో 1900 క్రాస్

కొత్త ఏడాది 2021లో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1900 డాలర్లు క్రాస్ చేసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.10 (-0.01%) డాలర్లు పెరిగి 1,901.60 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 1,901.60 - 1,901.60 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 25.03% శాతం పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్షీణించింది. ఔన్స్ ధర -0.002 (-0.01%) డాలర్లు పెరిగి 26.525 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 26.525 - 26.525

డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48 శాతం పెరిగింది.

English summary

Gold prices today: బంగారం ధరలు అలాగే, అక్కడ 1900 డాలర్లకు పైన.. | Gold prices rise for second straight day to Rs 50,298

Gold prices rose for the second straight day by Rs 96 to Rs 50,298 per 10 gram in the Mumbai retail market on rupee depreciation as trading in the overseas market was closed due to the New Year's Eve. The yellow metal surged Rs 161, or 0.32 percent, during the week in the domestic market.
Story first published: Friday, January 1, 2021, 22:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X