For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: షాక్... భారీగా పెరిగిన బంగారం ధరలు, ఎందుకంటే?

|

బంగారం ధరలు క్రితం సెషన్‌లో భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో 1810 డాలర్ల దిగువకు, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో రూ.50,000 స్థాయికి పడిపోయిన పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. కొనుగోలుదారులకు నిన్న షాకిచ్చాయి. కానీ నేడు కాస్త శాంతించినట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు ఫెడ్ సహా వివిధ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేటు పెంపు, మార్కెట్ పతనం వంటి అంశాలు ఇన్వెస్టర్లు బంగారం వైపు దృష్టి సారించడానికి కారణంగా మారింది.

వివిధ అంశాల ప్రభావంతో పసిడి వైపుకు పెట్టుబడులు మరలుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. క్రితం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.333 పెరిగి రూ.50,551 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.388 లాభపడి రూ.50,779 వద్ద ముగిసింది. మొన్నటి వరకు రూ.60,000 స్థాయిలో ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న రూ.60,500 క్రాస్ చేసింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.861 తగ్గి రూ.61,639, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.826 పెరిగి రూ.62,260 వద్ద ముగిసింది.

 Gold prices jumped above 50500 after demand surged

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1840 డాలర్లు క్రాస్ చేసింది. మొన్న 1810 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్, నిన్న 30 డాలర్లు పెరిగింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1841.20 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో 3.42 శాతం పెరిగి 1837 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.048 డాలర్లు ఎగిసి 21.843 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

Gold prices today: షాక్... భారీగా పెరిగిన బంగారం ధరలు, ఎందుకంటే? | Gold prices jumped above 50500 after demand surged

Gold prices jumped above 50,500 after demand surged. Gold prices yesterday ended at RS.50,551.
Story first published: Friday, May 20, 2022, 9:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X