For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'బంగారం'లాంటి న్యూస్: రూ.46,000కు దిగొచ్చిన పసిడి, వెండిదీ అదే దారి

|

బంగారం ధరలు నేడు (బుధవారం, ఫిబ్రవరి 17) భారీగా తగ్గాయి. ఎనిమిది నెలల కనిష్టానికి తగ్గిన ధరలు, ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో దాదాపు 20 శాతం మేర క్షీణించాయి. ఇటీవలి కాలంలో బంగారం ధరలు ప్రతి సెషన్లోను తగ్గుతోన్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ మార్కెట్లో నేడు ఓ సమయంలో రూ.600కు పైగా తగ్గి, రూ.46,240 స్థాయికి వచ్చింది. రిటైల్ మార్కెట్లో నేడు రూ.700కు పైగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.46,100కు పడిపోయింది. ఇంతకుముందు ట్రేడింగ్‌లో రూ.46,820 వద్ద ట్రేడ్ అయింది. వెండి కూడా భారీగానే తగ్గింది. వెండి రూ.69,000 దిగువకు వచ్చింది. కిలో వెండి రూ.1,275 వరకు తగ్గి రూ.68,240 పలికింది.

<strong>అర్ధరాత్రి నుండి తప్పనిసరి, FASTag లేకుంటే డబుల్ ఛార్జ్</strong>అర్ధరాత్రి నుండి తప్పనిసరి, FASTag లేకుంటే డబుల్ ఛార్జ్

రూ.46,400 దిగువకు బంగారం

రూ.46,400 దిగువకు బంగారం

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు భారీగా తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.522.00 (-1.11%) తగ్గి రూ.46,377.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,800.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,240.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.497.00 (-1.06%) తగ్గి రూ.46,564 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,900.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,912.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,447.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.69,000 దిగువకు వెండి

రూ.69,000 దిగువకు వెండి

వెండి ధరలు ఈ రోజు తగ్గాయి. అయితే రూ.69,000 దిగువకు వచ్చాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.580.00 (-0.84%) తగ్గి రూ.68,792.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,507.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,626.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,496.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.553.00 (-0.78%) తగ్గి రూ.69,932.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,657.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,700.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,856.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిగువకు పసిడి

1800 డాలర్ల దిగువకు పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువకు వచ్చాయి. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 21.30

(1.18%) డాలర్లు తగ్గి 1777.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,772.80 - 1,794.20 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 12.81 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.210

(-0.77%) డాలర్లు పెరిగి 27.115 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.965 - 27.477 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 53.24 శాతం పెరిగింది.

English summary

'బంగారం'లాంటి న్యూస్: రూ.46,000కు దిగొచ్చిన పసిడి, వెండిదీ అదే దారి | Gold prices fall to below Rs 46,500, plunge 20 percent from record high

Gold prices in India fell for the fifth straight day on Wednesday, tracking weak global market trends. The US dollar and Treasury yields surged. At current prices, gold is trading at the lowest levels in eight months.
Story first published: Wednesday, February 17, 2021, 21:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X