For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైకీ కిందకు బంగారం ధరలు: మళ్లీ పెరిగాయి, అంతర్జాతీయ మార్కెట్లోను..

|

బంగారం మళ్లీ షాకిస్తోంది. తగ్గినట్లేతగ్గి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత నెలలో రూ.44,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ నెలలో రూ.46,000కు పైనే కదలాడుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా సెకండ్ వేవ్, ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి వివిధ అంశాలు బంగారానికి ఊతమిస్తున్నాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9500 తక్కువగా ఉంది. గత నెలలో ఓ సమయంలో రూ.12,400 తక్కువగా కూడా ఉంది. ఈ కాలంలో రూ.3వేలు పెరిగింది. వెండి ధరలు కూడా కిలో రూ.67,000కు పైన ఉంది. నేడు ఓ సమయంలో రూ.68,000ను కూడా క్రాస్ చేసింది.

Gold Loans: బంగారం రుణం తీసుకున్నారా, మీపై ప్రభావం ఎలా?Gold Loans: బంగారం రుణం తీసుకున్నారా, మీపై ప్రభావం ఎలా?

బంగారం ధరలు జంప్

బంగారం ధరలు జంప్

గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ.46వేలకు పైనే ఉన్నాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్‌లో రూ.156.00 (0.33%) పెరిగి రూ.46,764.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,680.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,870.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,680.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.192.00 (0.41%) పెరిగి రూ.47023.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,980.00 ప్రారంభమైన ధర, రూ.47,070.00 గరిష్టాన్ని, రూ.46,960.00 కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప పెరుగుదల

వెండి స్వల్ప పెరుగుదల

వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.200.00 (0.30%) పెరిగి రూ.67838.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,708.00 వద్ద ప్రారంభమై, రూ.68,060.00 గరిష్టాన్ని, రూ.67,705.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.268.00 (0.39%) పెరిగి రూ.68905.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,783.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,085.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,770.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడా ధరలు జంప్

అక్కడా ధరలు జంప్

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. మళ్లీ 1750 డాలర్ల దిశగా కదులుతోంది. 6.75 (0.39%) డాలర్లు పెరిగి 1,743.05 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,734.45 - 1,742.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. 0.069

(+0.27%) డాలర్లు తగ్గి 25.593 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.383 - 25.665 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

పైకీ కిందకు బంగారం ధరలు: మళ్లీ పెరిగాయి, అంతర్జాతీయ మార్కెట్లోను.. | Gold price today: Yellow metal trades in green

Gold was trading higher on April 15 in Indian markets following a positive trend in international spot prices. On the Multi-Commodity Exchange (MCX), June gold contracts were trading higher by 0.36 percent at Rs 46,775 for 10 grams at 0935 hours. May silver futures were trading 0.25 percent higher at Rs 67,810 a kilogram.
Story first published: Thursday, April 15, 2021, 12:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X