For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగి, ఆ తర్వాత తగ్గి.. అంతలోనే దూసుకెళ్తున్న బంగారం ధరలు

|

బంగారం ధరలు నేడు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. జార్జియా ఎన్నికల ఫలితాలపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మెలిక పెట్టారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ మ్యూట్‌గా ఉంది. ఈ ప్రభావం దేశీయ ఫ్యూచర్ మార్కెట్ పైన పడింది. మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో పసిడి ధర మొదట అతి స్వల్పంగా పెరిగి, తర్వాత అంతేస్థాయిలో తగ్గింది. సాయంత్రం సెషన్ సమయానికి స్వల్పంగా పెరిగింది. నిన్న దాదాపు రూ.1200 పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చింది. వెండి రూ.2000 వరకు పెరిగింది. పసిడి ధరలు గత ఏడాది ఆగస్ట్‌లో జీవనకాల గరిష్టాన్ని తాకి, ఆ తర్వాత పడిపోయాయి. ఏడాది చివరలో రూ.50,000 వద్ద ముగిసింది.

స్థిరంగా బంగారం ధరలు

స్థిరంగా బంగారం ధరలు

నేడు (మంగళవారం, 5) ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 186.00 (0.36%) పెరిగి రూ.51610.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,397.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,780.00 వద్ద గరిష్టాన్ని, రూ.51,333.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.4600 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.132.00 (0.26%) పెరిగి రూ.51636.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,490.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,835.00 వద్ద గరిష్టాన్ని, రూ.51,400.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.500 జంప్

వెండి రూ.500 జంప్

సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. చాలా రోజుల తర్వాత రూ.70,000 క్రాస్ చేసింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 491.00 (0.70%) పెరిగి రూ.70527.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,302.00 వద్ద ప్రారంభమై, రూ.70,878.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,060.00 వద్ద కనిష్టాన్ని తాకింది. బంగారం రెండు రోజులుగా రూ.70వేలకు పైనే ఉంది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగానే పెరిగింది. రూ.350.00 (0.49%) పెరిగి రూ.71369.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,347.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,771.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,080.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

బంగారం 1950 డాలర్లు క్రాస్

బంగారం 1950 డాలర్లు క్రాస్

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1950 డాలర్లను క్రాస్ చేసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 5.10 (+0.26%) డాలర్లు తగ్గి 1,951.70 డాలర్లు పలికింది. నేటి సెషన్లో 1,938.45 - 1,955.85 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 22.94% శాతం పెరిగింది. నిన్న 40 డాలర్లకు పైగా పెరిగిన ధర నేడు 6 డాలర్లకు పైగా పెరిగి 1950 డాలర్లు క్రాస్ చేసింది,

సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. ఔన్స్ ధర +0.241 (+0.88%) డాలర్లు పెరిగి 27.765 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.152 - 27.700

డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.86 శాతం పెరిగింది.

English summary

భారీగా పెరిగి, ఆ తర్వాత తగ్గి.. అంతలోనే దూసుకెళ్తున్న బంగారం ధరలు | Gold price today: Yellow metal trades flat as dollar recovers

India Gold MCX February futures are trading flat on Tuesday following a muted trend seen in the international spot prices as the US dollar halted its slide ahead of Senate runoff elections in Georgia.
Story first published: Tuesday, January 5, 2021, 22:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X