For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: నిన్న రూ.800 పెరిగిన బంగారం ధర, నేడు స్థిరంగా

|

బంగారానికి ఈ-గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాల వైపు కొంతమంది మొగ్గు చూపుతున్నప్పటికీ, చాలామంది పెట్టుబడిదారులు మాత్రం భౌతిక బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తుండటంతో పసిడికి డిమాండ్ సహజం. దీంతో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఆసక్తి ఉండటం సహజం. ఈ నేపథ్యంలో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు(అక్టోబర్ 1 శుక్రవారం) స్థిరంగా ఉన్నాయి. మొన్న అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,600 దిగువన ముగిసింది. నిన్న ఏకంగా రూ.800 వరకు పెరిగి రూ.46,300 పైన ముగిసింది. నేటి ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 3.00 (0.01%) పెరిగి రూ.46326.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.69.00 (-0.15%) క్షీణించి రూ.46452.00 వద్ద ప్రారంభమైంది. ఇటీవల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,000 దిగువకు పడిపోయినప్పటికీ అంతర్జాతీయ పరిణామాల కారణంగా ధరలు పెరిగాయి. దీంతో రూ.46,500 దిశగా కనిపిస్తోంది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగినప్పటికీ రూ.60,000 దిగువనే ఉంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.117.00 (-0.20%) క్షీణించి రూ.59500.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.119.00 (-0.20%) తగ్గి రూ.59980.00 వద్ద ట్రేడ్ అయింది.

నిన్న రూ.800 పెరిగి, నేడు స్థిరంగా

నిన్న రూ.800 పెరిగి, నేడు స్థిరంగా

క్రితం సెషన్‌లో బంగారం ధరలు ఏకంగా రూ.800 పెరిగాయి. పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ 1.7 శాతం లేదా రూ.800 పెరిగింది. అదే సమయంలో కిలో వెండి ధర 2 శాతం లేదా రూ.1200 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం క్షీణించి రూ.1,754.64 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ భారీగా పెరిగింది. 1750 డాలర్లు దాటి 1757 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నేడు మాత్రం స్వల్పంగా తగ్గింది. నేడు ప్రారంభ సెషన్‌లో 3.65 (-0.21%) తగ్గి 1,753.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.003 (+0.01%) డాలర్లు పెరిగి 22.050 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ప్లాటినమ్ ధర 0.9 శాతం తగ్గి 954.51 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

35 డాలర్లు జంప్

35 డాలర్లు జంప్

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏడువారాల గరిష్టం నుండి నిన్న కాస్త కోలుకొని, 1750 డాలర్లను క్రాస్ చేశాయి. యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్లు ఓటు, చైనా ఎవర్ గ్రాండ్ రిస్క్, ప్రపంచ ఆర్థిక రికవరీ పైన మరోసారి ఆందోళనలు వంటి అంశాలు నిన్న తాత్కాలికంగా ప్రభావం చూపాయి. దీంతో బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా పెరిగాయి. అంతర్జాతీయంగా సంక్షోభం తలెత్తినప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు అందరు చూస్తారు. గోల్డ్ ఫ్యూచర్స్ మొన్న 1722 డాలర్ల వద్ద ముగిసింది. అంటే క్రితం సెషన్‌లోనే 35 డాలర్లకు పైగా పెరిగింది. నేడు అతి స్వల్పంగా తగ్గింది.

1764 డాలర్లకు..

1764 డాలర్లకు..

బంగారం ధర 1764 డాలర్ల వద్ద గరిష్టాన్ని కూడా తాకింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ మద్దతు ధర రూ.45550-రూ.46400, నిరోధకస్థాయి రూ.45920-రూ.46600, సిల్వర్ మద్దతుధర రూ.59000-రూ.59500 ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండిని రూ.57700 వద్ద స్టాప్ లాస్‌గా పెట్టుకొని రూ.58100 వద్ద కొనుగోలు చేయవచ్చునని, టార్గెట్ ధర రూ.59,000గా చెబుతున్నారు.

English summary

Gold Price Today: నిన్న రూ.800 పెరిగిన బంగారం ధర, నేడు స్థిరంగా | Gold Price Today: Yellow metal today stable after a big jump

In the previous session, gold had jumped 1.7% or ₹800 per 10 gram while surged 2% or ₹1,200 per kg. Spot gold fell 0.1% to $1,754.64 per ounce.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X