For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price today: బంగారం ధరలు రూ.48,000 వద్దే ఉండే ఛాన్స్

|

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన అనంతరం బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, అది మందకోడిగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు నిన్న స్థిరంగా ఉన్నాయి. నేడు కూడా స్థిరంగా లేదా అతి స్వల్ప పెరుగుదలతో ఉన్నాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు(గురువారం, డిసెంబర్ 9) ప్రారంభ సెషన్‌లో రూ.24 లాభపడి రూ.48,079 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.7 పెరిగి రూ.48,210 వద్ద ట్రేడ్ అయింది. ఒమిక్రాన్ వెలుగు చూసిన గత రెండు వారాల్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.900 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1,785.50 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ప్రారంభ సెషన్లో 0.65 డాలర్లు లాభపడి 1786.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఒమిక్రాన్ ప్రభావం అంతంతే

ఒమిక్రాన్ ప్రభావం అంతంతే

సౌతాఫ్రికాలో గత నెల 24వ తేదీన ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అదే సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి పుంజుకుంటుందని భావించారు. పసిడి ధరలు పెరిగాయి.. కానీ అనుకున్నంతగా పెరగలేదు. ఇందుకు కారణం ఒమిక్రాన్ వెలుగుచూసిన ప్రారంభంలో ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందోనని అవగాహన వచ్చే వరకు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత క్రమంగా ఒమిక్రాన్ ప్రభావం అంతంతే అని వెల్లడవడంతో బంగారం ధరలు దాదాపు స్థిరత్వానికి వచ్చాయి. అందుకే ఈ వారం పసిడి ధరలు పెరుగుతున్నప్పటికీ, అత్యంత స్వల్పంగా కదులుతున్నాయి.

వెండి రూ.62,000 దిగువనే

వెండి రూ.62,000 దిగువనే

వెండి ధరలు దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.62,000 దిగువనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోను 23 డాలర్ల దిగువన ఉన్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.23.00 (-0.04%) క్షీణించి రూ.61600.00 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1.00 (-0.00%) తగ్గి రూ.62201.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.008 డాలర్లు పెరిగి 22.440 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఏడాది కాలంలో దాదాపు 10 శాతం క్షీణించింది. అదే ఏడాది కాలంలో గోల్డ్ ఫ్యూచర్ ధర 6 శాతం మేర తగ్గింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8200 వరకు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 290 డాలర్లు తక్కువగా ఉంది.

ట్రేడింగ్ స్ట్రాటెజీ

ట్రేడింగ్ స్ట్రాటెజీ

బంగారం ధరలు ఈ వారం దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కామెక్స్‌లో బంగారం మద్దతు ధర 1770 డాలర్లు, నిరోధకస్థాయి 1800 డాలర్లు. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.47,700. నిరోధకస్థాయి రూ.48,350గా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా ద్రవ్యోల్భణ డేటా విడుదల నేపథ్యంలోదాదాపు స్థిరంగా ఉండవచ్చునని అంటున్నారు.

English summary

Gold Price today: బంగారం ధరలు రూ.48,000 వద్దే ఉండే ఛాన్స్ | Gold Price today: Remain choppy below $1,800 ahead of US inflation

Gold prices were marginally down on Thursday ahead of key inflation data and amid a firm US dollar.
Story first published: Thursday, December 9, 2021, 10:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X