For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.48,000కు పైనే బంగారం ధరలు: హైదరాబాద్‌లో ధర ఎంతంటే?

|

బంగారం ధరలు నేడు(నవంబర్ 9 మంగళవారం) స్థిరంగా ఉన్నాయి. గత వారం భారీగా పెరిగిన పసిడి ధర నిన్న కూడా పెరిగినప్పటికీ అది స్వల్పమే. నేడు అతి స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కి పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1825 డాలర్ల వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.65,000 దిగువన ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో 24.500 డాలర్ల దిగువకు వచ్చింది. వివిధ పరిణామాల నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని గతంలోనే బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అంచనాలకు తగినట్లు ధరలు గతవారంలో భారీగా పెరిగాయి. గతవారం మొత్తంగా డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.500 వరకు పెరిగింది. ఈ వారం స్థిరంగా కనిపిస్తున్నాయి.

నేటి బంగారం ధరలు

నేటి బంగారం ధరలు

బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. క్రితం సెషన్‌లో రూ.48,000కు పైనే ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు అతి స్వల్పంగా క్షీణించినప్పటికీ ఆ స్థాయికి పైనే ఉన్నాయి. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.17.00 (-0.04%) క్షీణించి రూ.48001.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.44.00 (0.09%) పెరిగి రూ.48200.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 2.75 (-0.15%) డాలర్లు క్షీణించి 1,825.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,030.00 నుండి రూ.47,976.00 మధ్య ట్రేడ్ అయింది. ఓ సమయంలో రూ.48,000 దిగువకు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఈ మార్కు దాటింది. కామెక్స్‌లో నేడు గోల్డ్ ఫ్యూచర్స్ 1,823.50 - 1,828.80 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. బంగారం 52 వారాల గరిష్టం 1971.50 డాలర్లు, 52 వారాల కనిష్టం 1677.90 డాలర్లు. ఏడాదిలో 7.4 శాతం మేర తగ్గింది.

వెండి ధరలు

వెండి ధరలు

ఎంసీఎక్స్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 94.00 (-0.14%) తగ్గి రూ.64787.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.92.00 (-0.14%) క్షీణించి రూ.65488.00 వద్ద ట్రేడ్ అయింది. నేడు సిల్వర్ ఫ్యూచర్స్ రూ.64,877.00 నుండి రూ.64,753.00 మధ్య ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.080 (-0.33%) డాలర్లు క్షీణించి 24.462 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 24.438 - 24.562 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 5.89 శాతం క్షీణించింది.

హైదరాబాద్‌లో రూ.49,000 వద్ద

హైదరాబాద్‌లో రూ.49,000 వద్ద

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,030.

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260.

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,440.

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,510.

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110.

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,210 వద్ద ఉంది.

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110.

English summary

రూ.48,000కు పైనే బంగారం ధరలు: హైదరాబాద్‌లో ధర ఎంతంటే? | Gold Price Sees Change: Yellow metal above Rs 49,000 in Hyderabad

Gold price is consolidating near two month highs of $1825, finding demand from broad based US dollar weakness and renewed downside in the Treasury yields across the curve.
Story first published: Tuesday, November 9, 2021, 10:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X