For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Rises: భారీగా తగ్గి, అంతేస్థాయిలో పెరిగిన బంగారం ధర

|

బంగారం ధరలు క్రితం సెషన్‌లో స్వల్పంగా లాభపడ్డాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)కు నేడు సెలవు రోజు. దీపావళి సందర్భంగా మార్కెట్లు నిన్న, నేడు సెలవు రోజు. అయితే సంవత్ 2078లోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్టాక్ మార్కెట్లో మూరత్ ట్రేడింగ్ ఉంటుంది. అలాగే నిన్న సాయంత్రం ఎంసీఎక్స్ కూడా కొనసాగింది. నిన్నటి సెషన్‌లో బంగారం మళ్లీ భారీగా పెరిగింది. అంతకుముందు రూ.47,000 స్థాయికి వచ్చిన గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.571 పెరిగింది. దీపావళికి ముందు తగ్గిన పసిడి, ఆ తర్వాత ఇప్పుడు అంతేస్థాయిలో పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.1700కు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ నేడు కొనసాగుతోంది. అక్కడ నేడూ గోల్డ్ ఫ్యూచర్ ధరలు పెరిగాయి. 1800 డాలర్ల స్థాయికి వచ్చాయి.

గోల్డ్ ఫ్యూచర్స్ ధర

గోల్డ్ ఫ్యూచర్స్ ధర

దేశీయ ప్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.571.00 (1.21%) తగ్గి రూ.47571.00 వద్ద ముగిసింది. నిన్నటి సెషన్‌లో రూ.47,590.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇక ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.525.00 (1.11%) క్షీణించి రూ.47687.00 వద్ద ట్రేడ్ అయింది. నిన్న రూ.47,720.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,551.00 వద్ద కనిష్టాన్ని తాకింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.8700 తక్కువగా ఉంది. నేడు అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 2.30 (0.13%) డాలర్లు లాభపడి 1,795.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 1,793.50 వద్ద క్లోజ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్

సిల్వర్ ఫ్యూచర్స్

దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ ధర క్రితం సెషన్‌లో రూ.64,000 దాటింది. రూ.1,759.00 (2.82%) పెరిగిన సిల్వర్ ఫ్యూచర్స్ రూ.64224.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,660.00 (2.63%) పెరిగి రూ.64836.00 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.79000తో రూ.15000 వరకు తక్కువగా ఉంది.

పన్నెండు నెలల్లో భారీ పెరుగుదల

పన్నెండు నెలల్లో భారీ పెరుగుదల

బంగారం ధరలు వచ్చే పన్నెండు నెలల కాలంలో అంటే వచ్చే దీపావళి నాటికి రూ.52,000 నుండి రూ.54,000 వరకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. త్వరలో బంగారం డిమాండ్ తగ్గి, ధరలు రూ.47,000 దిగువకు పడిపోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని, పెరుగుతాయని అంటున్నారు.

English summary

Gold Price Rises: భారీగా తగ్గి, అంతేస్థాయిలో పెరిగిన బంగారం ధర | Gold Price Rises to Rs 47,571 But Still Rs 9,500 Cheaper than All Time High

Gold price in India saw a surge on Friday, November 5. The yellow metal has been under pressure for the last few weeks, especially during Dhanteras, ahead of Diwali.
Story first published: Friday, November 5, 2021, 10:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X