For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గతవారం బంగారం ధర ఎంత పెరిగిందంటే? నెలలో తొలిసారి డిస్కౌంట్ ఆఫర్

|

గోల్డ్ డీలర్స్ బంగారంపైన ఈ నెలలో మొదటసారి డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. వరుసగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ధరల హెచ్చుతగ్గులపై ఆందోళనతో ఉన్నారు. ఈ ప్రభావం పసిడి డిమాండ్ పైన పడింది. దీంతో డీలర్స్ ఔన్స్ పసిడి పైన 5 డాలర్ల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అంతకుముందు వారం 1.5 డాలర్ల ప్రీమియం ఉంది. దాదాపు నెల రోజుల్లో డిస్కౌంట్ ఇవ్వడం మొదటిసారి. బంగారం ధరలపై 10.75 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

భారీగా పెరిగి, స్వల్పంగా తగ్గి

భారీగా పెరిగి, స్వల్పంగా తగ్గి

గతవారం పసిడి ధరలు రూ.47,750 దిగువన ప్రారంభం కాగా, వారాంతానికి రూ.48,000 పైకి చేరుకుంది. గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.400 వరకు పెరిగింది. గతవారం సోమవారం నుండి గురువారం వరకు ధరలు పెరిగాయి. ఓ సమయంలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,500కు చేరుకుంది. అయితే చివరి సెషన్‌లో మాత్రం రూ.350 వరకు తగ్గింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో రూ.342.00 క్షీణించి రూ.48,058 వద్ద క్లోజ్ అయింది. బంగారం ధరలు గతవారం ఓ సమయంలో రూ.900కు పైగా పెరిగి, చివరకు 400 లాభంతో ముగిశాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.361 తగ్గి రూ.48,314 వద్ద ముగిసింది.

సిల్వర్ ఫ్యూచర్స్ ఎలా ఉందంటే

సిల్వర్ ఫ్యూచర్స్ ఎలా ఉందంటే

గతవారం వెండి ధరలు క్షీణించాయి. రూ.69,000 పైన ప్రారంభమైన సిల్వర్ ఫ్యూచర్స్ ఈ స్థాయి దిగువకు వచ్చింది. దాదాపు 800 వరకు తగ్గింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్ ధర చివరి సెషన్లో రూ.1,336 తగ్గి రూ.68,345 వద్ద ముగిసింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.1,186.00 క్షీణించి రూ.69676.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోను గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్లు దాటి 1830 డాలర్లను కూడా క్రాస్ చేసింది. అయితే చివరి సెషన్లో ఏకంగా 17 డాలర్ల మేరకు పడిపోయి 1812 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువకు వచ్చింది.

వరుసగా నాలుగో వారం..

వరుసగా నాలుగో వారం..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వరుసగా నాలుగో వారం లాభాల్లో ముగిసింది. డేల్టావేరియంట్ ఆందోళనలతో పలు దేశాలు కరోనా లాక్ డౌన్ ఆంక్షలను విధిస్తున్నాయి. దీంతో గోల్డ్ ఫ్యూచర్స్ 1815 డాలర్ల దిగువన క్లోజ్ అయింది. ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ వ్యాఖ్యల ప్రభావం బంగారంపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అధిక ద్రవ్యోల్భణం కారణంగా ఇటీవల బంగారం లాభపడింది.

English summary

గతవారం బంగారం ధర ఎంత పెరిగిందంటే? నెలలో తొలిసారి డిస్కౌంట్ ఆఫర్ | Gold price rises Rs 400 last week, Sold at a discount for first time in a month

Dealers offered a discount of up to $5 an ounce over official domestic prices this week, compared to last week's premium of $1.5.
Story first published: Sunday, July 18, 2021, 11:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X