For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజురోజుకూ తగ్గుతోంది.. గరిష్టంతో రూ.12,000 తగ్గిన బంగారం ధర

|

ఫ్యూచర్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్లో ఈ వారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. అహ్మదాబాద్ మార్కెట్లో ఈ వారం పసిడి ధరలు ఇప్పటికే రూ.1800 వరకు పడిపోయాయి. గత శుక్రవారం 48,300 నుండి ఇక్కడ 46,500 స్థాయికి పడిపోయింది. అహ్మదాబాద్ మార్కెట్లో ఫిబ్రవరి 1వ తేదీన 50,700 నుండి చూసుకుంటే ఏకంగా 8.2 శాతం పడిపోయింది. ఫ్యూచర్ మార్కెట్లో రూ.45,000 దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు క్షీణించాయి. బంగారం ధరలు ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో దాదాపు రూ.12,000 తక్కువగా ఉంది.

HDFC గుడ్‌న్యూస్, హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: SBI, కొటక్ బ్యాంకులోను...HDFC గుడ్‌న్యూస్, హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: SBI, కొటక్ బ్యాంకులోను...

రూ.12 వేలు తక్కువ

రూ.12 వేలు తక్కువ

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (శుక్రవారం, మార్చి 5) ఉదయం సెషన్లో రూ.44,500 దిగువకు వచ్చింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.178.00 (0.40%) తగ్గి రూ.44,363.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,444.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,444.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,363.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.155.00 (0.35%) తగ్గి రూ.44,581 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,600.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,570.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.65,500 దిగువనే

వెండి రూ.65,500 దిగువనే

వెండి ధరలు రూ.500కు పైగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.509.00 (0.77%) తగ్గి రూ.65,412.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,931.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,931.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,322.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.524.00 (0.78%) తగ్గి రూ.66440.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.676,445.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,445.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,440.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1700 డాలర్ల దిగువకు పసిడి

1700 డాలర్ల దిగువకు పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి. 1700 డాలర్ల దిగువకు వచ్చాయి. నేడు ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -10.85(0.64%) డాలర్లు తగ్గి 1689.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,684.05 - 1,696.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువకు వచ్చింది. ఔన్స్ ధర -0.186 (-0.73%) డాలర్లు తగ్గి 25.275 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.062 - 25.460 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

రోజురోజుకూ తగ్గుతోంది.. గరిష్టంతో రూ.12,000 తగ్గిన బంగారం ధర | Gold price plunges by Rs 1,800 in week, down ₹12,000 from record highs

Plummeting by around Rs 1,800 over a week, gold price settled at Rs 46,500 per 10 gram in Ahmedabad on Thursday.
Story first published: Friday, March 5, 2021, 10:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X